ఆధ్యాత్మికం

Usiri Chettu Puja : ఉసిరి చెట్టు వ‌ద్ద పూజ చేసి.. ఈ మంత్రాల‌ను ప‌ఠించండి.. స‌క‌ల శుభాలు క‌లుగుతాయి..

Usiri Chettu Puja : కార్తీక మాసంలో భ‌క్తులు చాలా మంది ఉద‌యాన్నే లేచి కార్తీక స్నానాలు ఆచ‌రిస్తుంటారు. కార్తీక దీపాలు పెడుతుంటారు. ఇక కార్తీక పౌర్ణ‌మి రోజు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు. శివుడికి ఎంతో ప్రీతి పాత్ర‌మైన ఈ మాసంలో ఆయ‌న‌కు పూజ‌లు, అభిషేకాలు చేస్తే ఎంతో పుణ్యం వ‌స్తుంది. అలాగే కార్తీక పౌర్ణ‌మి రోజు 365 వ‌త్తుల‌తో దీపాల‌ను వెలిగిస్తారు. దీంతో సంవ‌త్స‌రం మొత్తం పూజ‌లు చేసిన ఫ‌లితం ఈ ఒక్క రోజే ల‌భిస్తుంది. అయితే కార్తీక మాసంలో దీపారాధ‌న‌, తుల‌సి పూజ‌తోపాటు వ‌న భోజ‌నాలు కూడా చేస్తారు. ముఖ్యంగా ఉసిరి చెట్టుకు పూజ‌లు చేస్తారు. ఉసిరి చెట్టు నీడ‌లో వ‌న భోజ‌నాలు చేస్తారు. అయితే ఉసిరికి ఈ మాసంలో ఎందుకు అంత‌టి ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు.. అంటే..?

ఈ మాసంలో చ‌లి ప్రారంభ‌మ‌వుతుంది. దీంతో మ‌న‌కు అనేక వ్యాధులు వ‌స్తాయి. అయితే ఉసిరి వ‌ల్ల మ‌న‌కు సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌నుక ఉసిరికి ద‌గ్గ‌ర‌గా ఉండాల‌ని చెప్ప‌డం కోస‌మే ఆ చెట్టుకు ఈ మాసంలో అంత‌టి ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. ఇక ఉసిరి నీడ ప‌డే నీటిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వ‌స్తుందని.. ఆరోగ్య‌ప‌రంగా కూడా మేలు జ‌రుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు.

Usiri Chettu Puja do like this for luck and wealth

క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో వ‌చ్చిన‌ అమృతం కోసం దేవ‌దాన‌వుల మ‌ధ్య జ‌రిగిన యుద్ధంలో కొన్ని చుక్క‌ల అమృతం నేల‌పై ప‌డింద‌ట‌. అప్పుడే ఉసిరి చెట్టు మొలిచింద‌ని చెబుతారు. క‌నుక ఉసిరి స‌క‌ల రోగాల‌ను న‌యం చేసే శ‌క్తిని క‌లిగి ఉంటుంది. దీని గురించి ఆయుర్వేదంలో ప్ర‌ధానంగా చెబుతారు. అనేక ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. ఉసిరి చెట్టు వేళ్లు భూమిలోకి వెళితే అక్క‌డ ఉప్పు నీరు కూడా మంచి నీరుగా మారుతుంద‌ట‌. క‌నుక‌నే ఉసిరికి అంత‌టి ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు.

అయితే ఈ మాసంలో ఉసిరి చెట్టుకు త‌ప్ప‌క పూజ‌లు చేయాలి. ఉసిరి చెట్టు వ‌ద్ద దీపారాధ‌న చేసిన అనంత‌రం కింద ఇచ్చిన మంత్రాల‌ను ప‌ఠిస్తే.. ఎంతో పుణ్యం వ‌స్తుంది. భ‌గ‌వంతుడి ఆశీస్సులు ల‌భిస్తాయి.

Admin

Recent Posts