ఆధ్యాత్మికం

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు.. కంటి చూపు వ‌స్తుంద‌ట‌..!

సాధార‌ణంగా ఈ ప్ర‌పంచంలో ఎన్నో అంతుచిక్క‌ని వింత‌లు జ‌రుగుతుంటాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని ఆల‌యాల్లో జ‌రిగే అద్భుతాలు ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉన్నాయి. ఇక ఆ పరమేశ్వరుడి లీలా విశేషాలు అర్థం చేసుకోవడం మునులు, మహర్షుల వల్లనే కాదు, ఇక సాధారణ మనష్సులకు ఏం అర్థం అవుతుంది. ఈ క్ర‌మంలోనే ఎన్నో పుణ్య‌క్షేత్రాల్లో జ‌రిగే వింత‌లు అంతుచిక్క‌నివి. అలాంటి ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నంజన్ గూడ్ దర్శనమిస్తున్నది.

కర్ణాటక రాష్ట్రం, మైసూరుకు దక్షిణంగా సుమారు 18 కి.మీ. దూరంలో నంజనగూడ్ లో అతి పురాతనమైన శ్రీ కంఠేశ్వర ఆలయం ఉన్నది. కంబిని నది తీరంలో గల శ్రీ కంఠేశ్వర దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయాన్ని నంజనగూడ్ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ గోపురం ఎత్తు – 120 అడుగులు. ఇక్కడ ఉన్న శ్రీకంఠేశ్వర గుడిని సందర్శిస్తే చూపు లేనివారికి చూపు వస్తుందని భక్తుల నమ్మకం.

visit nanjangud kanteshwara alayam to get eye sight

అయితే టిప్పు సుల్తాన్ తన పట్టపుటేనుగు చూపు కోల్పోతే.. ఈ స్వామిని ప్రార్ధించాడని దాంతో ఏనుగుకు చూపు వచ్చిందని స్థానిక కధనం. ఇక ఆలయ నిర్మాణశైలి ఆనాటి శిల్పకళా వైభవాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇవి 11వ శతాబ్దంలో స్థాపించినట్లుగా తెలియుచున్నది. ఈ ప్రాంగణంలో రాతిపై శివలీలలు అధ్బుతమైన దృశ్యాలతో చెక్కబడినాయి. ఈ స్వామిని దర్శించినవారికి తెలిసి తెలియక చేసిన పాపాలు, దీర్ఘరోగాలు నివారించబడతాయని భక్తుల నమ్మకం.

Admin

Recent Posts