ఆధ్యాత్మికం

1500 ఏళ్ల కింద‌ట నిర్మించిన ఆల‌యం ఇది.. ద‌ర్శిస్తే ఎలాంటి క‌ష్టాలు అయినా పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సుబ్రమణ్య స్వామి ఆరాధన అత్యంత పవిత్రం&period; నాగుపాములు&comma; కార్తీకేయ రూపం&comma; షణ్ముఖ రూపం&comma; వల్లీదేవసేన సహిత సుబ్రమణ్య రూపం&comma; పుట్టలు&comma; నాగపడిగెలు ఇలా అనేక రూపాల్లో ఆరాధించే స్వామి సుబ్రమణ్య స్వామి&comma; ఆయన ఆదిశంకరులు ప్రతిపాదించిన షణ్ముఖారాధనలో కార్తీకేయుడు ఒకరు&period; అయితే ఈ స్వామిని దీపం రూపంలో ఆరాధిస్తారు కొందరు&period; అయితే సుబ్రమణ్యస్వామి దేవాలయాలు అంటే మనకు గుర్తుకువచ్చేది తమిళనాడు&period; అరుదైన మూర్తి స్వరూపంలో ఉండే సుబ్రమణ్యస్వామి గురించి తెలుసకుందాం… రామాపురం కడప జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు&period; కానీ ఈ గ్రామంలో ఉన్న ద్వికంఠ షణ్ముఖ సుబ్రమణ్య స్వామి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు&period; దాదాపు పదిహేను వందల ఏళ్ల క్రితం నాటి ఈ విగ్రహానికి మళ్లీ పునర్‌వైభవం తీసుకువచ్చారు ఆ గ్రామస్థులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామాపురంలో పురాతన శివాలయం ఒకటుండేది&period; కొంతకాలం కిందట ఆ ఆలయానికి సమీపంలో ఉన్న ఓ గదిలో అలనాటి అపురూప విగ్రహాలు బయటపడ్డాయి&period; వీటిలో ద్వికంఠ షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి&comma; మోక్ష నారాయణ స్వామి&comma; సంజీవని మూలికాసహిత హనుమ&comma; కౌలినీ మాత&comma; ఉగ్రభైరవ మూర్తులు ఉన్నాయి&period; ఈ విగ్రహాలు పదిహేను వందల సంవత్సరాల పూర్వం నాటివని పురాతత్వశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు&period; అత్యంత విలువైన ఈ విగ్రహాలకు అనేక ప్రత్యేకతలున్నాయి&period; ఇక్కడి ద్వికంఠ షణ్ముకుడు ప్రపంచంలో మరెక్కడా కనిపించడు&period; శ్రీవల్లీ&comma; దేవసేన సమేతంగా షణ్ముఖుడి విగ్రహముంటుంది&period; అంతే కాదు&period;&period; ఈ విగ్రహానికి అభిషేకం చేసే సమయంలో&period;&period; ఆవు పాలు నీలివర్ణంలో కనిపిస్తాయి&period; ఇదొక విశేషమని చెప్పాలి&period; ఇక్కడి మరో విశేషం మోక్ష నారాయణుడి విగ్రహం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80811 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;subramanya-swamy&period;jpg" alt&equals;"visit this subramanya swamy temple to remove any obstacles " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహావిష్ణువు మోక్ష నారాయణ స్వామిగా వెలగొందుతున్న ఏకైక క్షేత్రం కూడా ఇదేనని గ్రామస్థులు పేర్కొంటున్నారు&period; ఈ విగ్రహం వామహస్తంలోని శంఖువు కాస్త కిందికి ఉంటుంది&period; మోక్షానికి మార్గంగా దక్షిణ హస్తం చూపుడు వేలు పైకి చూపుతున్నట్టు ఉండే నారాయణుడి మూర్తి దివ్య తేజస్సుతో కనిపిస్తుంది&period; ప్రతి మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున నారాయణుడు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తారు&period; ఈ సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు&period; సాయంత్రం స్వామివారికి కల్యాణం నిర్వహిస్తారు&period; ఇక ఆంజనేయ విగ్రహానికి మరో ప్రత్యేకతుంది&period; ఈ విగ్రహంలో ఆంజనేయుడు సంజీవని పర్వతంతో పాటు సంజీవని మూలికను కూడా చేతిలో పట్టుకుని వస్తున్నట్టుగా దర్శనమిస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటితో పాటుగా లలితాంబికా రూపమైన కౌలినీ మాత ఇక్కడ కొలువై ఉంది&period; లలితా సహస్రనామావళిలో కౌలినీ మాత ప్రస్తావన ఉంది&period; ఈ అమ్మవారికి ఉజ్జయినిలో ఒక ఆలయం ఉండేదని&comma; అయితే ప్రస్తుతం అది శిథిలమైందని చరిత్రకారులు చెబుతున్నారు&period; అలాంటి దేవాలయం ప్రస్తుతం మరెక్కడా లేదు&period; రుద్రాంశగా భావించే భైరవుడు ఇక్కడ క్షేత్రపాలకుడుగా వెలిశాడు&period; అరుదుగా కనిపించే బకుట్‌ భైరవ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు&period; ఉగ్రభైరవుడికి తోడుగా భైరవి మాత&comma; కాలభైరవుడి విగ్రహాలను ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు&period; రామాపురంలో ఈ విగ్రహాలను పునఃప్రతిష్టించటంలో కాశీభట్ల సాయినాథశర్మ కీలక భూమిక పోషించారు&period; పుణ్యభూమి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు ఆలయ నిర్వాహణ సజావుగా జరిగేలా చూస్తున్నారు&period; రామాపురం కడప నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది&period; కమలాపురం- ఎర్రగుంట్ల దారిలో జాతీయరహదారిపై ఒక కిలోమీటర్‌ దూరం వెళ్తే రామాపురం వెళ్లే దారి వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts