Salt: సాధారణంగా ఉప్పును ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. ఉప్పు సముద్రగర్భం నుంచి ఉద్భవించింది కనుక లక్ష్మీదేవి కూడా సముద్రగర్భం నుంచి ఉద్భవించింది కనుక ఉప్పును సాక్షాత్తూ లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఉప్పును ఎప్పుడుపడితే అప్పుడు ఎవరికీ దానం చేయకూడదు. అలాగే ఒకరి చేతి నుంచి మరొక చేతికి కూడా ఇవ్వకూడదు. ఇలా ఉప్పును చేతికి ఇవ్వక పోవడానికి గల కారణం ఏమిటి ? ఉప్పును చేతికి ఇస్తే ఏం జరుగుతుంది.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఉప్పును శుభకార్యాల సమయంలో దానం చేయరు. కేవలం శని దానాలలో, పితృ కార్యాలలో మాత్రమే ఉప్పు దానం చేస్తారు. ఇటువంటి కార్యాలలో ఉప్పును దానం చేస్తారు కనుక ఉప్పును అశుభానికి గుర్తుగా భావిస్తారు. అందుకోసమే ఉప్పును ఒకరి నుంచి మరొకరి చేతికి ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.
ఇక ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కనుక చేతికి ఇస్తే మన దగ్గర ఉండే లక్ష్మి (సంపద) వారికి వెళ్లిపోతుంది. కనుకనే ఉప్పును చేతికి ఇవ్వకూడదు. దానం అస్సలు చేయకూడదు. ఇదీ.. అసలు విషయం.