సాధారణంగా భారతదేశం అంటేనే గుళ్ళూ గోపురాలు పూజలు, అనేక మతాలు కులాలతో కూడిన అతి పెద్ద ఆచారాలు కలిగిన దేశం. భారతదేశంలో ఏ గుడికి వెళ్లిన దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే సాధారణంగా గుళ్లలో కానీ మన ఇళ్లలో కానీ అఖండ దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం.. మరి అఖండ దీపం అంటే ఏమిటి ఎందుకు వెలిగించాలి ఓసారి చూద్దాం..
మామూలుగా వెలిగించే దీపం కనీసం ఒక రెండు గంటలు వెలుగుతుంది. అసలు అఖండము అంటే ఖండము లేనటువంటిది. ఈరోజు మనం ఎన్ని గంటలకు దీపాన్నీ వెలిగించామో రేపు మళ్లీ అదే సమయం వరకు దీపం వెలుగుతూ ఉండేటువంటి దానిని అఖండ దీపం అని పిలుస్తారు. అందుకే అఖండ దీపాలను చిన్నచిన్న ప్రమిదలలో పెట్టకుండా ఒక పెద్ద మట్టి పాత్రలో పెడుతూ ఉంటారు. ఆ పాత్రను తీసుకొని దాన్ని ముందుగా నీటిలో నానబెట్టి, తర్వాత తీసి తుడిచి దాన్ని పూర్తిగా అలంకరణ చేసి దాని నిండుగా నువ్వుల నూనె పోసి పెద్ద వత్తి వేసి వెలిగిస్తూ వుంటారు.
ఈరోజు మనం బ్రహ్మ ముహూర్తంలో వెలిగిస్తే రేపటి బ్రహ్మముహూర్తం వరకు వెలుగుతూ ఉండేదాన్ని అఖండ దీపం అని పిలుస్తూ ఉంటారు. మనం రోజూ చిన్నచిన్న దీపాలలో పూజ సమయంలో వెలిగిస్తాం అది కొంత సమయం ఉండి మళ్లీ ఆరిపోతుంది. కానీ అఖండంగా వెలిగేటువంటి దీపాన్ని అఖండ దీపంగా పిలుస్తారు. ఏవైనా వ్రతాలు, నోములు నోచినా, దేవాలయాల్లో హోమాలు చేసినప్పుడు కూడా ఈ దీపాలు వెలిగిస్తూ వుంటారు.