ఆధ్యాత్మికం

Naga Dosham : నాగ‌దోషం అంటే ఏమిటో తెలుసా.. ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Naga Dosham &colon; చాలామందికి నాగదోషం అంటే ఏంటో తెలియదు&period; నాగదోషం అంటే ఏంటి&period;&period;&quest; అని అడుగుతూ ఉంటారు&period; జాతకములో కాలసర్పదోషం ఉన్నవాళ్లు&comma; పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములని చంపిన వాళ్ళు&comma; వివిధ మంత్ర ఔషధములతో సర్పములని బంధించిన వారు&comma; పాము పుట్టాలని తవ్విన వాళ్లకి నాగదోషం కలుగుతుంది&period; అలానే కొంతమంది పాము పుట్ట తవ్వి దాని మీద ఇల్లు కడుతూ ఉంటారు&period; అలాంటి వారికి కూడా నాగదోషం ఉంటుంది&period; జన్మజాతకమందు రాహువు&comma; కేతువుల మధ్య గ్రహాలు ఉన్నా కూడా ఈ నాగదోషం ఉంటుంది&period; పంచమంలో రాహువు ఉంటే నాగ దోషం అని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ దోషం ఉంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయి&period;&period;&quest;&comma; ఎలా ఈ దోష నివారణ చేసుకోవాలి అనే విషయాలను కూడా చూసేద్దాం… కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి వివాహం&comma; సంతానం&comma; కుటుంబం అభివృద్ధి&comma; ఆరోగ్య విషయాల్లో ఎక్కువ ప్రభావం పడి&comma; అనేక బాధల్ని చూస్తారు&period; ఎక్కువగా పెళ్లి ఆలస్యం అవుతుంది&period; సంతానం కలగరు&period; నాగ దోష నివారణకి శుక్ల చవితి&comma; శుక్ల పంచమి&comma; శుక్రవారం&comma; ఆదివారం విశిష్టం&period; పౌర్ణమి&comma; దశమి&comma; ఏకాదశి&comma; ద్వాదశి తిథులు అనుకూలంగా ఉంటాయి&period; అలానే కృష్ణ పక్షము నాగపూజకి అనువైనది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58313 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;nagadosham-1&period;jpg" alt&equals;"what is naga dosham and how it affects" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగ దోష నివారణ చేయించుకుంటే వంశాభివృద్ధి అవుతుంది&period; ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందుతుంది&period; ప్రశాంతంగా ఉండొచ్చు&period; జాతకచక్రంలో రాహువు లేదా కేతువు 1&comma; 2&comma; 5&comma; 7&comma; 8 స్ధానాలలో ఉండి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉంటే సర్ప దోషం ఉంటుంది&period; జాతకచక్రంలో రాహువు లేదా కేతువు లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ ఉండి శుభగ్రహ దృష్టి లేకపోతే కూడా పెళ్లిళ్లు ఆలస్యం అవ్వడం&comma; బాధలు&comma; తగాదాలు వంటివి జరుగుతాయి&period; పంచమ స్ధానంలో రాహువు లేదా కేతువు ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేనట్టయితే&comma; సంతానం ఆలస్యం అవుతుంది&period; లేదంటే సంతానం లేకపోవటం&comma; అబార్షన్స్ అవడం లాంటివి జరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంచమంలో రాహువు ఉంటే నాగ దోషం&period; నివారణ కోసం నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే నివారణ కలుగుతుంది&period; జాతకచక్రంలో సప్తమ స్ధానంలో రాహువు లేదా కేతువు ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేనట్టయితే బార్యా భర్తల మధ్య ఇబ్బందులు&comma; గొడవలు వస్తాయి&period; అష్టమ స్ధానంలో రాహువు లేదా కేతువు ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేదంటే అనారోగ్య సమస్యలు&comma; తిండి లేకపోవడం&comma; పాము కలలు రావటం వంటివి జరుగుతాయి&period; ఇలా ఏదోకటి కలుగుతాయి కనుక దోష నివారణ చేసుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts