తిరుపతి అని అడిగారు కాబట్టి కొండ కింది ప్రాంతం అని అర్థం. అదే తిరుమల అని ఉంటే కొండ మీది ప్రాంతం గురించి చెప్పాల్సి వచ్చేది. ఇక తిరుపతి విషయానికొస్తే, చాలానే ఉన్నాయ్, కానీ బయట నుండి వచ్చే వారు వెతుక్కుని వెళ్ళలేరు, సులభంగా మీరు కొండకి వెళ్లే దారిలోనే చెప్తా. బస్టాండ్ కి యెదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంటుంది, అందులో స్వామి అన్నప్రసాదం పెడతారు, నీట్ గా రుచిగా ఉంటుంది.
మేం రెస్టారెంట్స్ లోనే తింటాం అంటే గనక, అక్కడ నుంచి కొంచెం ముందుకి తిరుమల వైపు వెళ్లినా, లేదా గరుడ వారధి పైన వచ్చినా, గరుడ వారధి ఫ్లైఓవర్ దిగగానే Hotel Orion ఉంటుంది మెయిన్ రోడ్ లేన్ , రైస్ బాగుంటుంది.
ఇదొక్కటే అనుకోవద్దు మిత్రులారా, చాలా ఉన్నాయ్, ఇది మీకు వెళ్ళే దారిలో సులభం గా ఉంటుంది.