ఆధ్యాత్మికం

సంపద, శుభాలు కలగాలంటే ఏయే చెట్లను ఎలా పూజించాలో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని చెట్లను దైవ సమానంగా భావిస్తారు&period; ఇలా దైవ సమానంగా భావించే మొక్కలను పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని భావిస్తారు&period; ఈ క్రమంలోనే కొందరు మహిళలు ప్రత్యేక పర్వదినాలలో లేదా ప్రత్యేక మాసాలలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు&period; హిందూ ధర్మం ప్రకారం అత్యంత పవిత్రమైన చెట్లు ఏవి&comma; వాటిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి&period;&period; అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జమ్మి చెట్టును హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు&period; ఈ క్రమంలోనే జమ్మిచెట్టుకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుంది&period; అలాగే శని గ్రహదోషం ఉన్నవారు శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శనిగ్రహ దోషం తొలగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56120 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;tree&period;jpg" alt&equals;"which trees you should grow for luck and wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మర్రి చెట్టును కూడా ఎంతో పవిత్రమైన వృక్షంగా భావిస్తారు&period; మర్రి చెట్టుకు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల పితృదేవతల ఆత్మ సంతృప్తి చెందుతుందని భావిస్తారు&period; అలాగే మర్రి చెట్లలో సకల దేవతలు కొలువై ఉండటం వల్ల మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు&period; మరికొందరు మర్రిచెట్టుతోపాటు వేపచెట్టుకు కూడా పూజలు నిర్వహిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఇంటి ఆవరణంలో తులసి మొక్క ఉండటం మనం చూస్తుంటాము&period; తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం వల్ల తులసి మొక్కను పెద్ద ఎత్తున ఆరాధిస్తారు&period; ముఖ్యంగా చెట్టుకు సాయంత్రం నీరు పోయకుండా&comma; ఏకాదశి తిథులలో తులసి మొక్కను తుంచకుండా పూజ చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉపవాస దీక్షలతో గురువారం అరటి చెట్టును పూజించడం వల్ల శ్రీహరి సంతృప్తి చెంది ఆయన అనుగ్రహం మనపై ఉంటుంది&period; ఉపవాసంతో అరటి చెట్టుకు మినప పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించి పూజించాలి&period; ఇలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts