హిందువులు తమ అభిరుచులు, విశ్వాసాలకు అనుగుణంగా తమకిష్టమైన దేవుళ్లు, దేవతల విగ్రహాలు, చిత్రపటాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తారన్న సంగతి తెలిసిందే. అలా చేయడం వల్ల తమ ఇష్టదైవం అనుగ్రహించి తాము కోరిన కోర్కెలను వారు తీరుస్తారని భక్తుల నమ్మకం. అయితే అంత వరకు కరెక్టే, కానీ మీకు తెలుసా..? పలు రకాల దేవుళ్ల విగ్రహాలు, చిత్రపటాలను మాత్రం ఇంట్లో పెట్టుకోకూడదట. అవును, మీరు విన్నది కరెక్టే. మరి ఏయే రకాలకు చెందిన విగ్రహాలు, పటాలను ఇంట్లో పెట్టుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందామా..!
శివుడు రుద్ర రూపంలో ఉండి తాండవం చేస్తున్నట్టుగా ఉండే విగ్రహం లేదా చిత్రపటాన్ని అస్సలు ఇంట్లో పెట్టుకోకూడదట. అలా పెట్టుకుంటే అన్నీ అశుభాలే కలుగుతాయట. శివుడు ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉండే విగ్రహం లేదా పటాన్ని పెట్టుకోవాలట. దాంతోనే మంచి జరుగుతుందట. దుర్గా దేవి, కాళికా దేవి… ఇలా రూపాలు ఏవైనా ఆ దేవత రాక్షసులను చంపుతున్నట్టుగా ఉండే విగ్రహాలు, పటాలను ఇంట్లో పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే ఇంట్లో అన్నీ సమస్యలే వస్తాయట.
ఏ దేవుడికి లేదా దేవతకు చెందిన విగ్రహాలు, పటాలనైనా ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయట. దేవుళ్లు, దేవతలకు చెందిన విగ్రహాలు పగిలిపోతే ఇంట్లో పెట్టుకోకూడదు. సమీపంలో ఉన్న గుడిలో పెట్టి రావాలి. లేదంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. చాలా మంది దేవుళ్ల ఫొటోలతో కూడిన క్యాలెండర్లను ఇంట్లో పెట్టుకుంటారు. అయితే అక్కడి వరకు ఓకే. కాకపోతే ఆ క్యాలెండర్ చిరిగిపోతే మాత్రం వెంటనే దాన్ని తీసేయాలి. లేదంటే ఆ ఇంట్లో అన్నీ సమస్యలే వస్తాయట.