సంప్రదాయాలు, ఆచారాలకు పెట్టింది పేరు హిందువులు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు హిందువులు చాలా సంప్రదాయాలు పాటిస్తారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్లు పెద్దవాళ్లు అయ్యేవరకు.. ఏదో ఒక సంప్రదాయం పాటిస్తారు. తలనీలాలు, అన్నప్రాసన, నామకరణం ఇలా రకరకాల సంప్రదాయాలు హిందువులకు ప్రత్యేకం. కొన్ని సందర్భాల్లో ఈ ఆచారాలు, సంప్రదాయాలు.. వాళ్ల ప్రాంతాన్ని బట్టి విభిన్నంగా ఉండవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సంప్రదాయం పుట్టు వెంట్రుకలు తీయించడం. అంటే.. పుట్టిన పిల్లలకు మొదటిసారి తల వెంట్రుకలు తీయించడమని అర్థం. ఈ ఆచారం హిందువులు పాటిస్తారు. మొదటిసారి.. ఇంటిదేవుడికి తలనీలాలు సమర్పిస్తారు. ఒకప్పుడు మగపిల్లలకు మాత్రమే.. ఈ సంప్రదాయం పాటించేవాళ్లు. కానీ.. ఆ తర్వాత ఆడపిల్లలకు కూడా మొదటిసారి తలనీలాలు.. ఇంటి దేవుడికే సమర్పించే ఆచారం ఉంది. మొదటిసారి తలనీలాలు తీయించే విధానాన్ని పుట్టు వెంట్రుకలు తీయించడం అని పిలుస్తారు.
ఈ సంప్రదాయన్ని ఒక ఫంక్షన్ లా నిర్వహిస్తారు. మొత్తం కుటుంబ సభ్యులందరూ కలిసి జుట్టు తీయించడం ఆనవాయితీగా వస్తుంది. అసలు ఈ సంప్రదాయం ఎలా వచ్చింది ? పిల్లలకు మొదటిసారి వెంట్రుకలు తీయించేటప్పుడు నియమాలేంటి ? ఈ పూర్వ ఆచారం వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ? హిందువులు పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎందుకు తీయిస్తారు ? తలనీలాలు మొదటిసారి.. తీసే సంప్రదాయంలో చాలా నియమాలున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్దతి పాటిస్తారు. కొంతమంది బేబీకి ఏడాదిలోపు, కొందరు మూడేళ్లలోపు, మరికొందరు 5ఏళ్లలోపు తలనీలాలు తీయిస్తారు. తలనీలాలు తీయించే రోజు చాలా మంచిదై ఉండాలి. పంచాంగం ప్రకారం… సమయం, డేట్ చూసి.. ఈ రోజుని నిర్ణయిస్తారు. ఈ తలనీలాలు తీసేసమయంలో బిడ్డను అమ్మ తన ఒడిలో కూర్చోపెట్టుకుంటుంది. అప్పుడు ఎదురుగా పూజారి మంత్రాలు చదువుతారు. ఈ సమయంలో.. మేనమామ మూడుసార్లు మేనల్లుడు లేదా మేనకోడలు జుట్టు కత్తిరిస్తారు.
ఆ తర్వాత బార్బర్ మొత్తం జుట్టుని షేవ్ చేస్తాడు. ఇలా తలనీలాలు తీయడం వెనక చాలా నమ్మకాలున్నాయి. పుట్టుకతో వచ్చిన జుట్టులో పూర్వజన్మకు సంబంధించిన కోరదగని లక్షణాలు ఉంటాయని.. వాటిని ఈ జన్మలో ఉండకుండా తొలగించాలనే ఇలా.. తలనీలాలు తీయిస్తారు. ఈ సంప్రదాయం వెనక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇలా గుండు చేయించడం వల్ల.. మెదడు ఎదుగుదల సజావుగా ఉంటుందని.. నరాలు ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉంటాయని సైన్స్ చెబుతోంది. అలాగే అనారోగ్యాలు తొలగిపోయి.. ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి ఈ ఆచారం సహాయపడుతుందట.