భయం పోయి, ధైర్యం రావాలంటే ఆంజనేయ దండకం చదవమని మన పెద్దలు మనకు చాలా సార్లే చెప్పి ఉంటారు. గట్టిగా ఉరుము ఉరిమినా, చీకట్లో ఒంటరిగా ఉన్నా…ఆపత్కాల సమయాల్లో అయినా…. చాలా మంది ఆంజనేయ దండకాన్ని వల్లె వేస్తుంటారు…. నిజంగా ఆంజనేయ దండకం చదితే భయం పోతోందా? అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే దీనికి సమాధానం అవును అంటున్నారు కొంత మంది విశ్లేషకులు…అదెలా అని డౌట్ అడిగితే సైన్స్ అండ్ లాజిక్ ను మిక్స్ చేసి సరికొత్త విషయాన్ని చెబుతున్నారు వారు . ఆంజనేయ దండకం చదివితే భయమెలా పోతుందా ఓ సారి పరిశీలిద్దాం.
అసలు భయం అంటే ఏమిటి? ” ఓ విషయం పట్ల మనస్సు ఏర్పరచుకున్న ప్రతికూల భావన( నెగెటివ్ ఫీలింగ్)” అంటే ఒకే విషయం పట్ల మానవుని మనస్సు లో …..ఇది తనకు వ్యతిరేకంగా జరగబోతోంది అనే బలమైన ఫీలింగ్…ఇలాంటి సమయంలో మనస్సు, మెదడు…మానవశరీరంలో స్పందిచే అవయవాలన్నీ…అదే భావన మీద కేంద్రీకృతమై ఉంటాయి. ఈ సమయంలో…ఆంజనేయ దండకం చదవితే…మనస్సు కాస్త డైవర్ట్ అవుతుంది. శ్రీ ఆంజనేయం అని గట్టిగా బయటికి చదువుతున్న సమయంలో దాని తర్వాత లైన్ ఏంటి? అనే దాని మీద మనస్సు కేంద్రీకృతమవుతుంది, మనస్సు తో పాటు అన్ని శారీరక అవయవాలు ఒక్కొక్కటిగా….ఇంతకు ముందున్న భయం అనే ఫీలింగ్ నుండి ఆంజనేయ దండకం అనే దాని మీదకు షిప్ట్ అవుతుంటాయి.. సో, మనం భయాన్ని పూర్తిగా పక్కకు పెట్టేస్తాం అన్నమాట..
మరో విషయం ఏంటంటే….ఆంజనేయ దండకంలో ప్రతి వాక్యం సున్నాను కూడి ఉంటాయి..శ్రీఆంజనేయం- ప్రసన్నాంజనేయం-ప్రబాధివ్యకాయం -ప్రకీర్తి ప్రదాయం-భజేవాయుపుత్రం- భజే వాలగాత్రం- భజేహం- పవిత్రం-భజే సూర్య మిత్రం – భజే రుద్రరూపం.ఇలా ప్రతి వాక్యం సున్నాను కలిగి ఉంటాయి. అయితే మనస్సు ఓ రకమైన భయానికి గురైనప్పుడు….ఇలా సున్నాలు ఎక్కువగా గల వాక్యాలను గట్టిగా చదవడం వల్ల…. మన లో ఉచ్చ్వాస, నిశ్చ్వాస ల వేగం పెరుగుతుంది…దీని వలన మన శరీరంలో ఓ రకమైన శక్తి ఉత్పన్నం అవుతుంది. ఇది అప్పటికీ మన మనస్సు కేంద్రీకృతమైన ఫీలింగ్ నుండి మనల్ని బయటికి పడేస్తుంది.
అయితే…భయం వేసిన సమయంలో…కేవలం ఆంజనేయ దండకం మాత్రమే కాదు….ఏ ఇతర పోర్స్ ఫుల్ పాటలను గట్టిగా పాడినా…మన మనస్సు భయం అనే ఫీలింగ్ నుండి డైవర్ట్ అవుతుంది. అయితే ఆంజనేయ దండకమే వల్లె వేయడానికి గల కారణం ఏంటంటే….అప్పటికే మన మైండ్ లో ఆంజనేయుడు అంటే అత్యంత ధైర్యవంతుడు అని ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి , ఆ టైమ్ లో హనుమంతుడి రూపాన్ని మన మైండ్ అచేతనంగా గుర్తుకు తెచ్చుకోవడం వల్ల….భయాన్ని అధిగమించి ధైర్యాన్ని పొందొచ్చన్నమాట.