ఆధ్యాత్మికం

China Jeeyar : చిన‌జీయ‌ర్ స్వామి ఎప్పుడు ఆ వెదురు ప‌ట్టుకుంటారు ఎందుకో తెలుసా?

China Jeeyar : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారికి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. దీపావళి పండుగ రోజున రాజమండ్రి సమీపంలోని అర్తమూరులో అలమేలు మంగతాయారు, వేంకటాచార్యులు గార్లకి శ్రీమన్నారాయణాచార్యులుగా జన్మించారు. ఈ సమీపంలోని గౌతమ విద్యాపీఠంలో స్వామి వేద గ్రంథముల, వైష్ణవ సంప్రదాయాలలో శిక్షణ పొందారు. తర్క శాస్త్రం, సంస్కృత భాషను నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వద్ద అభ్యసించారు. స్వామి 23 సంవత్సరాల వయసులో ఐహిక సుఖములను త్యజించి సన్యాసిగా మారతానని ప్రమాణం చేసారు, దీని పర్యవసానంగా జీయర్ అయ్యారు..సన్యాస స్వీకరణ తర్వాత కొన్నేళ్లకు గీతాజ్యోతి ఉద్యమాన్ని చేపట్టారు. గీతాజ్యోతి ఉద్యమం కేవలం భగవద్గీత ప్రాచుర్య రూపకాన్నే కాక, సమాజంలో ఉన్న సోమరితనాన్ని తొలగించే, సౌభ్రాతృత్వ భావనను ప్రతి ఒక్కరిలో మేల్కొల్పగలిగే వ్యూహంగా కూడా రూపుదిద్దుకుంది.

ఒక త‌త్వాన్ని మేము క‌లిగి ఉంటాం. విశ్వాసానికి ప్ర‌తీక‌గా దండ క‌లిగి ఉంటాం. కొంత మంది ఏక దండులు ఉంటారు. త‌త్వం ఒక‌టి. మాకు త‌త్వాలు మూడు. మూడింటిని విశ్వ‌సిస్తాం. కొంద‌రు ప్ర‌కృతిని మాయ అంటారు. దానిని మేము అంగీక‌రించం. ప్ర‌కృతిలో క‌నిపించేది ప్ర‌తీది కూడా వాస్త‌వ‌మే అని చిన‌జీయర్ స్వామి అన్నారు. అలానే చేతిలో ఉన్న నాలుగు వెదురు బొంగుల గురించి చెబుతూ ఇక్క‌డ మూడు పాయింట్స్ ఉన్నాయ‌న్నారు.ఏది మ‌న ఆలోచ‌న‌ల‌ని క్రాస్ చేస్తుందో అవ‌న్నీ స‌త్యాలు. వాస్త‌వంగా బ‌తుకుతూ అవాస్త‌వంగా బ్ర‌త‌క కూడ‌దు. రెండోది క‌దిలే ప్రాణులు చాలా ఉన్నాయి. క‌ద‌ల‌ని ప్రాణులు కూడా ఉన్నాయి.

why chinna jeeyar swami holds staff in his hands

క‌ద‌ల‌ని ప్రాణుల‌లో జీవం క‌లిగించే జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు కూడా వాస్త‌వం. మాకు ప్ర‌కృతి ఒక త‌త్వం, జీవుడు ఒక త‌త్వం. మ‌న‌ల్ని న‌డిపించే బ్ర‌హ్మ‌త‌త్వం ఒక‌టి ఉంది. వీటి క‌ల‌యికే ప్ర‌పంచం. ఈ మూడు త‌త్వాల క‌లయిక ప్ర‌పంచం కాగా, ఈ మూడు దండాలు. ఇక జ్ఞానం క‌లిగించే త‌త్వం ఆచార్య‌. నాలుగోది ఆచార్య దండం .ఇలా చిన‌జీయ‌ర్ స్వామి త‌న చేతిలోని వెదురు క‌ర్ర గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Admin

Recent Posts