ఆధ్యాత్మికం

తాంత్రిక పూజల్లో నిమ్మకాయలు ఎందుకు వాడతారో తెలుసా?

శత్రువులను ధైర్యంగా ఎదుర్కోలేక కొంత మంది చెడు బాట పడుతుంటారు. కొంత మంది వల్ల మనకు సమస్యలు ఎదురైనప్పుడు వారిని ఎదుర్కోలేక చేతబడి లాంటి కొన్ని చర్యలకు పాల్పడుతుంటాం. అవి చాలా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తాయి. ఒక్కో సారి ప్రాణాలు కోల్పోయేలా చేస్తాయి. చాలా మంది చేతబడులను నమ్మరు. కానీ వాటి ప్రభావం చాలా తీవ్ర స్ధాయిలో ఉంటుంది. చేతబడి లాంటి వాటి వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. ఎక్కువగా ఈ చేతబడులు మాంత్రికులు చేస్తుంటారు. వీరి ప్రవర్తన కూడా చాలా తేడాగా కనిపిస్తుంటుంది. ఇలాంటి దుష్ట ప్రయోగాలకు వివిధ రకాలైన వస్తువులను వాడతారు. అయితే ఎన్ని వస్తువులు వాడినా నిమ్మకాయ చేసినంత చెడు ఏ వస్తువు చెయ్యదని అంటారు.

అసలు చేతబడికి నిమ్మకాయ ఎందుకు ఉపయోగిస్తారు అని చాలా మందికి ఒక ప్రశ్న ఉండే ఉంటుంది. దీనికి ఎన్నో కారణాలున్న ప్రజల్లో సరైన అవగాహన లేక పెద్దగా ఎవరికి తెలీదు. మంత్ర విద్యల్లో నిమ్మకాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. తమ శక్తులు మరింత శక్తివంతంగా సమర్ధంగా ఉపయోగించేందుకు మంత్రగాళ్లు నిమ్మకాయను వాడతారు. నిమ్మకాయలు ఉపయోగించడం వల్ల వారు అనుకున్నది తక్కువ సమయంలోనే ఎక్కువ‌ ఫలితాన్ని పొందుతారు.

why lemon are used in tantrik pooja

ఫలానా వ్యక్తికి శాపం ఇవ్వడం మంత్ర విద్యల్లో ఓ భాగం. నిమ్మకాయ ఉపయోగించడం వల్ల ఆ శాపం ఆ వ్యక్తికి త్వరగా తగులుతుందని మంత్రగాళ్లు నమ్ముతారు. ఇది శాప ప్రభావాన్ని పదింతలు చేస్తుందని అందుకోసమే ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని నిమ్మకాయను ప్రయోగిస్తే ఆ ఫలితం ఎక్కువ ఉంటుందని నమ్ముతారు. కేవలం చేతబడికే కాకుండా అన్ని రకాల తాంత్రిక విద్యలకు నిమ్మకాయలను ఉపయోగిస్తారు. సూదులు గుచ్చితే ఆ ప్రభావం మరింత ఎక్కువ ఉంటుందని… అందుకోసమే ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని మెత్తగా ఉండే నిమ్మకాయలోకి సూది గుచ్చుతారు. ఈ నిమ్మకాయల్లో సగం సూది గుచ్చితే ఆ వ్యక్తి యొక్క అవయవాలు దెబ్బతింటాయి. అదే సూదిని నిమ్మకాయలోకి మొత్తం గుచ్చితే ఇక ఆ వ్యక్తికి మరణమే.

Admin

Recent Posts