ఆధ్యాత్మికం

విగ్ర‌హారాధ‌న ఎందుకు చెయ్యాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ లోకంలో ఎంతో మంది ఆత్మజ్ఞానము కలిగిన వారు ఉన్నారు&period; ఏమీ తెలియని అజ్ఞానులు ఉన్నారు&period; అజ్ఞానులు కామ్యకర్మలను ఆసక్తితో చేస్తుంటారు&period; వివిధ రూపాలతో&comma; నామాలతో&comma; దేవుళ్లను పూజిస్తుంటారు&period; అటువంటి వారిని చూసి జ్ఞానులు&comma; వాళ్లు సక్రమ మార్గంలో లేరని చెప్పకూడదు&period; అలా చేస్తే వారు చేసే కర్మలను కూడా చేయకుండా సోమరులుగా మారిపోతారు&period; జ్ఞానులు అయిన వాళ్లు తాము కర్మలు ఎలా చేయాలో ముందు తాము చేసి&comma; అజ్ఞానులకు చూపించి&comma; వారికి నచ్చచెప్పి&comma; వారితో నిష్కామ కర్మలను చేయించాలి&period; వారికి మార్గదర్శకులు కావాలి ఇక్కడ పరమాత్మ మరొక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాడు&period; ఇందాక చెప్పినట్టు లోకంలో జ్ఞానులు అంటే అన్నీ తెలిసిన వారే కాదు&comma; అజ్ఞానులు అంటే ఏమీ తెలియని వారు&comma; తెలిసీ తెలియని వారు కూడా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అజ్ఞానులు సాధారణంగా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేయడంలో నిమగ్నమయి ఉంటారు&period; అలాంటప్పుడు&comma; జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల నమ్మకాలను పాడు చేయకూడదు&period; వారి నమ్మకాలను మూఢనమ్మకాలని కొట్టి పారేయకూడదు&period; క్రమక్రమంగా వారికి నచ్చచెప్పాలి&comma; వారిని సక్రమమైన మార్గంలో పెట్టాలి&period; అలాకాకుండా&comma; ఒక్కసారిగా వారు చేసేది తప్పు అని ఖండిస్తే వారు దిక్కుతోచని వారైపోతారు&period; ఎందుకంటే ప్రతి వాడు కూడా నేను ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది&comma; ఆ ఫలితం నేను అనుభవిస్తాను అనే నమ్మకంతోనే కర్మలు చేస్తాడు&period; వాడి నమ్మకాన్ని జ్ఞాని తుంచేయకూడదు&period; మరి ఏం చేయాలి అని అందరికీ సందేహం వస్తుంది&period; అంటే అజ్ఞాని చేసే కర్మలనే జ్ఞాని ఫలాపేక్షరహితంగా&comma; స్వార్ధరహితంగా ముందు తాను చేస్తూ&comma; అజ్ఞానిని కూడా ఆ విధంగా చేయమని ప్రోత్సహించాలి&period; అప్పుడు అజ్ఞాని కూడా స్వార్ధం లేకుండా కర్మలు చేస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89952 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lord-shiva-3&period;jpg" alt&equals;"why we need to do pooja to god " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అజ్ఞానులు నిష్కామ కర్మతత్వము తెలియక&comma; తాము చేసేది మంచిది అనే భావనతో&comma; శ్రద్ధతో&comma; ఎంతో కొంత ప్రతిఫలం ఆశించి&comma; కర్మలు చేస్తుంటారు&period; అన్నీ తెలిసిన వాడు వెంటనే నీవు చేసేది తప్పు&comma; నీకు పాపం వస్తుంది అని మొహం మీద చెప్పకూడదు&period; అలా చెబితే అజ్ఞానులు నీకేం తెలియదు పో అనే వారు కూడా ఉంటారు&period; మరి కొందరు అసలు కర్మలు చేయడమే మానేస్తారు&period; మరి కొందరు రెచ్చిపోయి ఇంకా స్వార్ధపూరిత కర్మలు చేస్తారు&period; దానితో అంతా రసాభాస అవుతుంది&period; కాబట్టి జ్ఞాని అయిన వాడు అలా చేయకూడదు&period; తాను మాత్రము ఇంద్రియములను&comma; మనస్సును నిగ్రహించి&comma; శ్రద్ధతో&comma; ఓర్పుతో వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాలి&period; వారు చేసే కర్మలనే తాను అనాసక్తంగా&comma; స్వార్ధరహితంగా&comma; ఫలం ఆశించ కుండా చేసి&comma; దాని వలన కలిగే లాభాలను వారికి తెలియబరచి&comma; వారిని కూడా ఆ విధంగా చేయడానికి ప్రోత్సహించాలి&period; జ్ఞానులు చేసే కర్మలను చూచి&comma; దాని వలన వచ్చే మంచి ఫలితములను గ్రహించి&comma; అజ్ఞానులు కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తారు&period; మంచి మార్గంలో నడుస్తారు&period; కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక విషయం స్పష్టం చేసాడు&period; కేవలం ఉపన్యాసాలు ఇచ్చి తెలియని వారి మనసులు పాడుచేయకుండా&comma; తాను ఆచరించి ఇతరులచేత ఆచరింపజేయడం మంచిది అని స్పష్టంగా చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లు తత్వమును బోధించే వాళ్లు ఇలా ఎందుకు చెబుతున్నారు&period; వాళ్లకు తెలియదా అంటే అన్నీ తెలుసు&period; కానీ&comma; ఎవరికి&comma; ఏ విషయాన్ని&comma; ఏసమయంలో ఎలా బోధించాలో తెలియదు అంతే&period; మన వేదాలలో శాస్త్రాలలో అన్నీ చెప్పారు&period; విగ్రహారాధన&comma; పూజలు&comma; వ్రతాలు&comma; యజ్ఞాలు&comma; యాగాలు&comma; క్రతువులు అన్నీ చెప్పారు&period; ఆత్మతత్వము&comma; నిర్గుణ బ్రహ్మము&comma; నిర్గుణారాధన&comma; మానసిక పూజ&comma; ఓంకారము&comma; ధ్యానము&comma; మనసును ఆత్మలో సంయోగం చేయడం&period; ఇవి కూడా చెప్పారు&period; ఇవన్నీ నిర్దిష్టమైన పద్ధతిలో చేయాలి&period; ఒకటి వెంబడి ఒకటిగా చేయాలి&period; మనకు చదువు నేర్పేటప్పుడు&comma; ఒకటో క్లాసునుండి పదవ తరగతి వరకు వివిధ విషయాలు చెబుతారు&period; ఇంటర్ ఇటు స్కూలు విద్య&comma; అటు కాలేజీ విద్యకు అనుసంధానంగా పాఠాలు చెబుతారు&period; తరువాత కాలేజీ విద్య చెబుతారు&period; తరువాత మాస్టర్ విద్యచెబుతారు&period; ఇలా అంశాల వారీగా చెబుతారు అంతేకానీ ఒకే సారి యం&period;ఏ&period; పిహెచ్&period;డి విద్య పదేళ్ల వయసులో చెప్పరు&period; అలాగే ఎం&period;ఏ పాసయిన వాడు&comma; రెండో తరగతి విద్యార్థికి పాఠం చెప్పేటప్పుడు తన ఎం&period; ఏ విద్యను ప్రదర్శించకూడా&comma; రెండో తరగతి విద్యార్ధి స్థాయికి తగ్గట్టుగా చెప్పి క్రమక్రమంగా వాడిని వృద్ధిలోకి తీసుకురావాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-89953" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;pooja-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ముందు మనసు నిలవడానికి విగ్రహారాధన&comma; సంధ్యావందనము&comma; పూజలు&comma; వ్రతాలు&comma; దేవాలయాలు&comma; ఉత్సవాలు చేయమన్నారు&period; ఏమీ తెలియని వారిని అలాగే చేయమనాలి&period; అప్పుడు వారికి దైవం అంటే ఏమిటో తెలుస్తుంది&period; వారి మనసు దైవం మీదికి మళ్లుతుంది&period; మనసు దైవం మీద నిలకడగా ఉంటుంది&period; అప్పుడు నిర్గుణారాధన&comma; మానసిక పూజ ఆత్మను గురించి బోధించాలి&period; తరువాత మోక్షం కొరకు ప్రయత్నించాలి&period; ఇది కూడా జ్ఞానులు ముందు తాము మనస్ఫూర్తిగా&comma; యుక్తమైన మనసుతో శ్రద్ధగా&comma; ఆచరించి ఇతరులు కూడా తాము చేసిన విధంగా చేయమని ప్రోత్సహించాలి&period; అంతేకానీ విగ్రహారాధన పనికిరాదు&comma; పూజలు వ్రతాలు దండగ అని మొదలుపెడితే వాళ్లు అటు పూజలు చెయ్యడం మానేస్తారు&period; ఇటు ధ్యానం చేయడం చేత కాదు&period; రెండింటికి చెడ్డవారు అవుతారు&period; అదే ఓ శ్లోకంలో వివరించాడు పరమాత్మ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts