ఆధ్యాత్మికం

స్త్రీలు ఎందుకు సాష్టాంగ న‌మస్కారం చేయ‌కూడ‌దు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయాల్లో&comma; ఇంట్లో పూజ చేసే సమయంలో చాలామంది సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు&period; అయితే పురుషులు మాత్రమే చేయాలని&comma; మహిళలు చేయకూడదని పండితులు చెబుతారు&period; ఇందుకు కారణమేంటే&period;&period; సాష్టాంగ అంటే 8 అంగాలతో నమస్కారం చేయడం అర్థం&period; మనిషి సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు&period; అందుకే దేవాలయాల్లో బోర్లా పడుకుని ఆ అంగాలతో చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉరస్సుతో నమస్కారం చేసేటపుడు ఛాతి&comma; శిరస్సుతో నమస్కారం చేసేటపుడు నుదురు&comma; దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని తలుచుకోవాలి&period; మనస్పూర్తిగా మనస్సుతో నమస్కారం చేయాలి&period; వచసా నమస్కారం అంటే ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి&period; పద్భ్యాం నమస్కారం అంటే రెండు పాదాలు నేలకు&comma; కరాభ్యాం నమస్కారం అంటే రెండు చేతులు&comma; జానుభ్యాం నమస్కారం అంటే రెండు మోకాళ్ళు నేలకు తగులుతూ నమస్కారం చేయాలని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90235 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sashtanga&period;jpg" alt&equals;"why women should not do sashtanga namaskaram " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి&period; అంటే కాళ్లు&comma; చేతులు&comma; నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతోంది&period; స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే పొట్ట నేలకు తాకుతుంది&period; ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది&period; పాలిచ్చి పోషించే వక్ష స్థలం కూడా నేలకు తాకుతాయి&period; ఇలా చేయడం వల్ల ఏదైనా జరగరానిది జరిగే అవకాశం ఉంది&period; మన శాస్త్రాల్లో స్త్రీకి గొప్ప విలువ ఉంటుంది&period; సృష్టికి ఆధారమైన&comma; పోషణకు ఆధారమైన స్థలం నేలకి తాకకూడదు&period; అందుకే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts