పూర్వకాలం నుంచి మన పెద్దలు కొన్ని ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. అయితే చాలా వరకు అలాంటి ఆచారాల్లో అంతర్లీనంగా సైన్స్ దాగి ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఇప్పుడిప్పుడే తెలుసుకుని వారు పాటించిన ఆచారాలను మనం కూడా పాటిస్తున్నాం. అయితే కొన్ని రకాల ఆచారాలు మహిళలకు, కొన్ని పురుషులకు పరిమితం అయ్యాయి. ముఖ్యంగా వివాహం అయిన స్త్రీలు శుక్రవారం పూట చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వీటిని పురాణాల్లో కూడా వివరించారు. ఆచార్య చాణక్య కూడా ఈ విషయాల గురించి చెప్పారు. ఇక అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రవారం నాడు స్త్రీలు ఎట్టి పరిస్థితిలోనూ తలలో పేలను చూడరాదు. అందం మీద దృష్టి పెట్టకుండా ముఖానికి పసుపు రాసుకోవాలి. శుక్రవారం ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు. నలుపు రంగు బట్టలు వేసుకోరాదు. శుక్రవారం మాంసాహారం తినరాదు. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు.
శుక్రవారం ఎవరు పువ్వులు, గాజులు ఇచ్చినా కాదనకూడదు. తీసుకోవాలి. శుక్రవారం రోజు స్త్రీ అబద్దం ఆడరాదు. శుక్రవారం మెడలో తాళి లేకుండా ఉండరాదు. గుమ్మం, వాకిలి అశుభ్రంగా ఉంచరాదు. శుక్రవారం నాడు ఉదయం తలస్నానం చేసి గడపను చక్కగా అలంకరించి లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఇలా స్త్రీలు చేస్తుంటే ఆ ఇంట్లో సకల సంపదలు కొలువై ఉంటాయి.