పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చాలా పద్ధతుల్ని మనం పాటిస్తూ ఉంటాము. చనిపోయిన తర్వాత రెండు రోజులు పాటు అగర్బత్తిని వెలిగించరు. అయితే ఎందుకు అలా చేయరు..?, దాని వెనుక కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అగర్బత్తిని వెలిగించడం వలన వచ్చే ధూపం ఆత్మను డిస్టర్బ్ చేస్తుందని అంటారు. అందుకనే వెలిగించకూడదని అంటారు. అలాగే కుటుంబ సభ్యులకి ప్రశాంతత ఉండాలి. మానసికంగా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి వెలిగించడం వలన డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకని చనిపోయినప్పుడు అగర్బత్తిని వెలిగించకూడదని చెప్తూ ఉంటారు.
హిందూమతంలో కొన్ని పద్ధతుల్ని కచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాము. వాటిని ఫాలో అవ్వకపోతే ఏమైనా జరుగుతుందేమో అని భావిస్తారు. పెద్దలు ఇలా వెలిగించకూడదని చెప్పారు. ఒక పద్ధతి ఇలా ఉంది కాబట్టి పద్ధతిని మార్చకూడదని కూడా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. ఇటువంటి నమ్మకాన్ని అనుసరించడం వలన మానసికంగా కుటుంబ సభ్యులు స్ట్రాంగ్ గా ఉంటారు. అలాగే ఎలాంటి ఇబ్బందులు అయినా వస్తాయనే భయం కూడా ఉండదు. ఇలా ఈ రెండు కారణాల వలన చనిపోయిన రెండు రోజులు కూడా వెలిగించరు.
అగర్బత్తిని వెలిగించడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకని ప్రతిరోజు మనం దేవుడి గదిలో అగర్బత్తిని వెలిగిస్తాము. వీటిని వెలిగించడం వలన ఇంట్లో చెడు, దుష్టశక్తులు వంటివి ఉండవని కూడా నమ్ముతారు. అగర్బత్తిని వెలిగించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడం వలన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.