మోకాళ్ల నొప్పులు అనేవి సహజంగా వృద్ధాప్యంలో చాలా మందికి వస్తుంటాయి. ఎముకలు బలహీనంగా మారడం, పోషకాల లోపంతోపాటు కీళ్ల మధ్యలో ఉండే గుజ్జు అరిగిపోవడంతో సహజంగానే మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. శొంటి, జీలకర్ర, పుదీనా ఆకులను 30 గ్రాముల చొప్పున తీసుకోవాలి. మిరియాలు 15 గ్రాములు తీసుకోవాలి. అన్నింటినీ కలిపి మెత్తగా పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని పూటకు అర టీస్పూన్ చొప్పున రెండు పూటలా అర కప్పు నీటితో తీసుకోవాలి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి బయట పడవచ్చు.
2. వెల్లుల్లి పాయలను 10 గ్రాముల చొప్పున తీసుకుని ముద్దగా నూరి అర గ్లాసు పాలకు కలిపి పాలు చిక్కపడే వరకు మరిగించి రోజుకు ఒకసారి చొప్పున తీసుకోవాలి. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. ఆముదం పప్పును ఒక గింజతో మొదలు పెట్టి రోజుకు ఒక గింజ చొప్పున పెంచుతూ ఏడు రోజులకు ఏడు పప్పులను తిని ఎనిమిదో రోజు నుంచి ఒక్కో గింజను తగ్గించుకుంటూ తినాలి.
4. గసగసాలను నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను తాగుతుంటే కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. అర టీస్పూన్ శొంఠి పొడి, టీస్పూన్ నువ్వుల పొడి, అర టీస్పూన్ బెల్లంలను కలిపి ముద్దగా నూరి దాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.
6. అర కప్పు శొంఠి కషాయంలో రెండు టీస్పూన్ల ఆముదం కలిపి రెండు పూటలా తీసుకోవాలి.
7. లేత మునగ ఆకులను నెయ్యిలో వేయించి తింటుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
8. ఈత వేరు బెరడును కషాయంగా చేసుకుని తాగుతుంటే కీళ్ల నొప్పుల నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365