మహిళల్లో సహజంగానే కొందరిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంటుంది. దీంతో చాలా మందికి పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీవోఎస్) సమస్య వస్తుంటుంది. దీని వల్ల రుతు క్రమం సరిగ్గా ఉండదు. శరీరంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతాయి. జుట్టు రాలుతుంది. మొటిమలు వస్తాయి. దీంతోపాటు అండాలు సరిగ్గా విడుదల కావు. ఫలితంగా సంతాన లోపం సమస్య ఏర్పడుతుంటుంది. అయితే పీసీవోఎస్ సమస్య ఉన్నవారు డాక్టర్లు ఇచ్చే మందులతోపాటు కింద తెలిపిన ఆయుర్వేద విధానాలను పాటిస్తే దాంతో ఆ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. మరి ఆ మార్గాలు ఏమిటంటే…
1. పీసీవోఎస్ సమస్య ఉన్న మహిళలు పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, సీ ఫుడ్, కోడిగుడ్లు తదితర ఆహారాలను మానేయాలి. ఎక్కువ శాతం వృక్ష సంబంధ పదార్థాలనే ఆహారంలో భాగం చేసుకోవాలి.
2. పీసీవోఎస్ సమస్య ఉన్నవారు క్యారెట్, బీట్‌రూట్, పాలకూరను రోజూ తీసుకోవాలి. నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని జ్యూస్‌లా చేసి రోజూ తీసుకోవాలి. రాత్రి పూట ఆ జ్యూస్‌లను 28 రోజుల పాటు తాగాలి. దీంతో రక్తం శుద్ధి అవుతుంది. గర్బాశయానికి నష్టం జరగకుండా ఉంటుంది. అలాగే మెంతులు, వాము, పప్పు దినుసులు, సూప్‌లను ఎక్కువగా తీసుకోవాలి.
3. చియా విత్తనాలు, అవిసెలు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, నువ్వులు వంటి ఆహారాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని మహిళలు తీసుకుంటే కణాల నిర్మాణం జరుగుతుంది. శక్తి లభిస్తుంది. అలాగే జీలకర్ర, సోంపు గింజలు మహిళల్లో మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లను రాకుండా చూస్తాయి. కనుక వీటిని రోజూ తీసుకోవాలి. అలాగే ధనియాలు, యాకులను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. దీని వల్ల రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.
4. దానిమ్మ పండ్లు, నల్ల ద్రాక్షలను తినడం వల్ల కూడా రక్తం శుద్ధి అవుతుంది. గర్భాశయానికి తాజా ఆక్సిజన్ అందుతుంది. దీని వల్ల దెబ్బ తిన్న కణజాలం, కండరాలు, నాడులు మరమ్మత్తులకు గురవుతాయి. అవి మళ్లీ యథా ప్రకారం పనిచేస్తాయి. అలాగే సప్తాశయం కషాయం లేదా సుకుమారం కషాయం లను 3 – 4 నెలల పాటు తీసుకోవాలి. దీని వల్ల మహిళల్లో వచ్చే గైనకాలజీ సమస్యలు తగ్గుతాయి.
5. పీసీవోఎస్ ఉన్న మహిళలు ఒత్తిడిని తగ్గించుకునేందుకు యత్నించాలి. అందుకు గాను రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం, యోగా, ధ్యానం చేయడం, శ్వాస వ్యాయామాలు వంటివి చేయాలి. దీని వల్ల గర్భాశయ కండరాలు దృఢంగా మారుతాయి.
6. ఒంటె ఆసనం (ఉష్ట్రాసనం), పడవ ఆసనం (నౌకాసనం), సీతాకోక చిలుక ఆసనం (బద్ధ కోణాసనం) వంటి ఆసనాలను వేస్తే ఆరోగ్యంగా ఉంటారు. పీసీవోఎస్ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365