Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వ్యాధులు రుమటాయిడ్ ఆర్థరైటిస్

రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్‌.. ఆయుర్వేద చిట్కాలు..!

Admin by Admin
June 10, 2021
in రుమటాయిడ్ ఆర్థరైటిస్
Share on FacebookShare on Twitter

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌.. ఈ సమస్య ఉన్నవారికి మోకాళ్లు, భుజాలు.. ఇలా కీళ్లు ఉండే చోటల్లా నొప్పిగా ఉంటుంది. ప్రతి రోజూ క్షణ క్షణం ప్రతి కీలులోనూ నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి వాపులకు గురై ఎర్రగా మారి నొప్పి మరీ ఎక్కువవుతుంది. అడుగు వేసి తీస్తున్నప్పడల్లా ఎంతో బాధ కలుగుతుంది. కూర్చుంటే లేచేందుకు పది నిమిషాలు పడుతుంది. ఇలా రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నవారు క్షణ క్షణం నొప్పిని, తీవ్రమైన బాధను అనుభవిస్తుంటారు. ఇక ఆయుర్వేదంలో దీన్నే సంధివాతం అంటారు.

rheumatoid arthritis ayurveda remedies

కీళ్ల నొప్పుల బాధ భరించేవారికే తెలుస్తుంది. ఇది ఒక ఇన్‌ఫ్లామేటరీ వ్యాది. దీని వల్ల సంధులు.. అంటే కీళ్లు వాపులకు గురై, బిగుసుకుని, వంగిపోయే స్వభావాన్ని కోల్పోయి నొప్పులను కలగజేస్తాయి. దీన్నే ఆయుర్వేదంలో ఆమవాతం అని కూడా అంటారు. ఆమం అంటే మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విష పదార్థాలు. ఇవి సంధుల్లో చేరి వాతాన్ని కలిగించి అక్కడ ఉండే నరాల శక్తిని నశింపజేస్తాయి. దీంతో కీళ్ల నొప్పులు వస్తాయి.

కీళ్ల నొప్పులు నడి వయస్సు వారికి వస్తుంటాయి. వృద్ధాప్యంలో మరింత ఎక్కువవుతాయి. మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంటుంది. బహిష్టు ఆగిపోయిన స్త్రీలలో, బరువు ఎక్కువగా ఉన్న స్త్రీలలో ఈ నొప్పులు వస్తుంటాయి. సన్నగా ఉన్నవారిలో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే ఈ సమస్య వస్తుంటుంది. అయితే చిన్నపిల్లల్లోనూ ఈ సమస్య వస్తుంది. అలాంటప్పుడు జాగ్రత్త వహించాలి. గుండె జబ్బులు ఉన్నవారికి కీళ్ల నొప్పుల సమస్య ఉంటే మరిన్ని ఇబ్బందులు కలుగుతాయి.

ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, ఇష్టం వచ్చినట్లు, ఇష్టం వచ్చిన సమయంలో తినకూడని ఆహారాలను తినడం, ఎక్కువ నూనె పదార్థాలను తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల జీర్ణశక్తి నశిస్తుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. శరీరంలో విష, వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. ఇలాంటి సమయంలో ఆమ వాతం వస్తుంది.

జీర్ణం కాకుండా శరీరంలో పదార్థాలు వ్యర్థాలుగా మిగిలిపోతే అవి విష పదార్థాలుగా మారుతాయి. అవి రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరమంతటా వ్యాపిస్తాయి. కీళ్ల మధ్యలో ఉండే ఖాళీ స్థలంలో చేరుతాయి. ఆ భాగం శిథిలమవుతుంది. చీములాంటి పదార్థం తయారవుతుంది. కీళ్ల కదలికలకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో సంధి వాతం వస్తుంది.

కీళ్లు అంటే రెండు ఎముకల చివర్లు కలిసే చోటు. ఒక్కోసారి మూడు ఎముకల చివర్లు కూడా కలుస్తాయి. ఎముకల చివర్లు పలుచని సున్నితమైన పొరచే కప్పబడి ఉంటాయి. దీంతో ఒకదానికొకటి రాచుకోకుండా చక్కగా కదులుతాయి. కీలు పొరంతా సైనోవియమ్‌ అనే ధాతువుతో ఆవరింపబడి ఉంటుంది. ఇది చిక్కని నూనె లాంటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. దాన్నే సైనోవియల్‌ ఫ్లుయిడ్‌ అంటారు. ఈ నూనె లాంటి ద్రవం కీళ్లని కాపాడుతుంది. కదలికలు సరిగ్గా ఉండేలా చూస్తుంది. కానీ ఈ వ్యాధిలో మనలో ఉండే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో వ్యాధి తీవ్రతరం అవుతుంది.

పాలు, చేపలు కలిపి తినడం, అజీర్ణంగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడం, అజీర్ణంగా ఉన్నప్పుడు చల్లని నీటిలో ఈదడం, ఆకలి లేనప్పుడు అధికంగా తినడం వంటివి ఆమ వాతానికి కారణం అవుతుంటాయి. పాడైన సైనోవియమ్‌ పైన ఉన్న సున్నితమైన పొర కార్టిలేజ్‌ను ధ్వంసం చేస్తుంది. దీంతో ఎముక భాగం పాడవుతుంది. దీని వల్ల కండరాలు, ధాతువులు, నరాలు బలహీనమవుతాయి. కీళ్ల కదలికలకు ఆటంకం ఏర్పడుతుంది. బిగుతుగా మారిపోతాయి. వాపు వచ్చి నొప్పి కలుగుతుంది. నడవలేకపోతారు. కాళ్లు వంగవు. కనుక కింద కూర్చోవడం కష్టం అవుతుంది. కూర్చున్నా త్వరగా లేవలేరు.

ఆయుర్వేదంలో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌కు చికిత్స ఉంది. ఆమపాచక అంటే విష పదార్థాలను నిర్మూలించడం, జీర్ణశక్తిని మెరుగు పరచడం, ఉపవాసం, విరేచనం, చెమట పట్టించడం, వస్తి అనే క్రియల ద్వారా శరీరాన్ని శుభ్ర పరచాలి. తరువాత కీళ్లలో ఉండే చెడును బయటకు పంపాలి. దీంతో నొప్పిని తగ్గించవచ్చు. చలికాలం, వర్షాకాలంలో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నొప్పులు అధికంగా ఉంటాయి.

1. వేడి నువ్వుల నూనెలో రెండు వెల్లుల్లి పాయలు వేసి కాచిన నూనెతో కీళ్లకు వాపు పెట్టుకోవాలి. దీంతో నొప్పులు, వాపులు తగ్గుతాయి.

2. ఉడికించిన కూరగాయలు, క్యారెట్‌, అల్లం, ఉల్లిపాయలు, ఆకుకూరలు, పండ్లు, నిమ్మకాయ, మామిడికాయ, బొప్పాయి పండ్లను తింటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. రాస్నాక్వాదం, దశమూల క్వాదం, సత్యాది చూర్ణం, శతపుత్వాది చూర్ణం, వాతహర గుగ్గులు, శివగుగ్గులు వాడుకోవచ్చు.

4. జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, దాల్చి్న చెక్క, కుంకుమ పువ్వు. వీటిని ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకుని కలిపి పొడి చేసి అందులో శొంఠి చూర్ణం 100 గ్రాములు కలిపి తేనెతో నూరి శనగ గింజంత మాత్రలు చేసుకుని, మంచినీళ్ల అనుపానంతో ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకుంటే 40 రోజుల్లో నొప్పులు తగ్గుతాయి.

5. వేప నూనెలో జిల్లేడు వేరు చూర్ణం వేసి కలిపి వేడి చేసి పైన మర్దనా చేయాలి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

6. చేదు పుచ్చ వేరు, పిప్పళ్లు 100 గ్రాములు, బెల్లం 200 గ్రాములు కలిపి నూరి చిన్న మాత్రలు చేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకుంటే కీళ్ల నొప్పులు 10 రోజుల్లో తగ్గుతాయి. అయితే ఈ మాత్రల వల్ల విరేచనాలు అవుతాయి. కనుక ఆహారం పథ్యం పాటించడం మేలు.

7. గోరు వెచ్చని పాలలో పది చుక్కల వెల్లుల్లి రసం కలిపి ఉదయం తీసుకోవాలి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

8. శొంఠి చూర్ణం 100 గ్రాములు, నెయ్యి 100 గ్రాములు, వెల్లుల్లి 100 గ్రాములు కలిపి నూరి అందులో 100 గ్రాముల తేనె కలిపి నూరి చిన్న ఉసిరికాయంత మాత్రలు చేసుకుని ఉదయం, సాయంత్రం నీటితో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నవారు పాత బియ్యంతో వండిన అన్నం తినాలి. మునగ, కాకర కాయలు తినాలి. వేడి నీళ్లతోనే స్నానం చేయాలి. పులుపు లేని మజ్జిగ, చేదు, వగరు రుచులు కలిగిన పదార్థాలను తీసుకోవాలి. వంటల్లో అల్లం, పసుపు, శొంఠి, వెల్లుల్లి వాడుకోవాలి. అల్లం, జీలకర్రతో చేసే పెసరట్టు, గోధుమ రవ్వ ఉప్మా తీసుకోవాలి. పెరుగు, పాలు, బెల్లం, మినుములు, చల్లని నీళ్లు, వంకాయ, వేరుశెనగ నూనె, శనగ పిండితో చేసిన పదార్థాలను తినరాదు. మలమూత్రాలు వచ్చినప్పుడు ఆపుకోకూడదు. రాత్రుళ్లు త్వరగా నిద్రించాలి. ఎక్కువ సేపు మేల్కొని ఉండరాదు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: ayurveda remediesjoit painsrheumatoid arthritisఆయుర్వేద చిట్కాలుకీళ్ల నొప్పులురుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్‌
Previous Post

వివిధ రకాల టీలు.. వాటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

Next Post

గొంతు నొప్పి, గొంతు సమస్యలకు ఆయుర్వేద వైద్యం..!

Related Posts

ఆరోగ్యం

రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

September 24, 2021

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.