రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పవచ్చు. ఈ వ్యాధి చాలా మందికి వస్తోంది. దీని వల్ల వాపులు, నొప్పులు వస్తాయి. ముఖ్యంగా కీళ్లు వాపులకు గురై నొప్పిగా అనిపిస్తాయి. ఈ క్రమంలోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో మణికట్టు, చేతులు, వేళ్లలో స్పర్శ సరిగ్గా ఉండదు. నొప్పిగా ఉంటాయి. ఇది చాలా మందికి వస్తుంది. కంప్యూటర్ల మీద ఎక్కువగా పనిచేసేవారికి ఇలా అనిపిస్తుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. కనుక పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్దారణ చేయడం ముఖ్యం. దీంతో సమస్య ఏంటనేది తెలుస్తుంది. దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవచ్చు.
2. కేవలం గుండె సమస్యలు, గ్యాస్ వల్ల మాత్రమే కాదు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో కూడా ఛాతిలో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఈ లక్షణం కనిపించినా అనుమానించాల్సిందే. మెడ, చేతులు, వెన్నెముకలలో నొప్పి వస్తుంటుంది.
3. కళ్లలో నొప్పి ఉన్నా కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణంగా భావించాలి. చాలా కొద్ది మందిలో ఈ లక్షణం కనిపిస్తుంది.
4. అనేక కారణాల వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా కూడా ఆ విధంగా అవుతుంది. కనుక ఒక సారి వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది.
5. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే చేతులు, కాళ్లు తరచూ తిమ్మిర్లకు గురవుతుంటాయి. ఆయా భాగాల్లో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది.
కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. సమస్య ఉన్నట్లు తేలితే చికిత్స తీసుకోవాలి. దీంతో పరిస్థితి తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చు.