Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వ్యాధులు sinusitis

Sinus : సైన‌స్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా ? ఈ చిట్కాల‌ను పాటించండి..!

Admin by Admin
November 30, 2021
in sinusitis, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Sinus : చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు.. సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి ఇబ్బందులు ఇంకా ఎక్కువ‌వుతుంటాయి. శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. త‌లంతా భారంగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. సైన‌స్‌లో రెండు ర‌కాలు ఉంటాయి. అక్యూట్‌, క్రానిక్ అని 2 ర‌కాల సైన‌స్‌లు ఉంటాయి. క్రానిక్ సైనుసైటిస్‌కు యాంటీ బ‌యోటిక్స్‌ను వాడాల్సి ఉంటుంది. ఆక్యూట్ సైన‌స్‌కు ఇంట్లోనే చికిత్స తీసుకోవ‌చ్చు.

Sinus : సైన‌స్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా ? ఈ చిట్కాల‌ను పాటించండి..!

డ‌స్ట్ అల‌ర్జీ, కెమిక‌ల్స్‌, కాలుష్య కారకాలు వంటి వాటి వ‌ల్ల సైన‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తుంటుంది. దీంతో నాసికా మార్గాల్లో వాపులు వ‌స్తాయి. ఇన్‌ఫెక్ష‌న్‌ల‌కు గుర‌వుతాయి. ఈ క్ర‌మంలో త‌ల‌నొప్పి, ముఖం వాపులు, నొప్పి, జ్వ‌రం, గొంతు నొప్పి, ద‌గ్గు.. వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. సైన‌స్ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉన్న‌వారు డాక్ట‌ర్ చే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

1. నీటిని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల సైన‌స్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. నీటిని తాగ‌డం వ‌ల్ల మ్యూక‌స్ ప‌లుచ బ‌డుతుంది. దీంతో నాసికా మార్గాలు క్లియ‌ర్ అవుతాయి. ఈ క్ర‌మంలో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అందువ‌ల్ల నీటిని బాగా తాగాలి.

2. రోజూ ఉద‌యం, సాయ‌త్రం వేడి నీటిలో పుదీనా ఆకులు వేసి ఆవిరి ప‌ట్టాలి. దీంతో చాలా రిలీఫ్ వ‌స్తుంది. నొప్పి త‌గ్గుతుంది.

3. వేడి వేడి సూప్‌ల‌ను తాగ‌డం వ‌ల్ల కూడా మ్యూక‌స్ క‌రిగిపోతుంది. దీంతో సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

4. సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందించ‌డంలో యాపిల్ సైడర్ వెనిగ‌ర్ అద్భుతంగా ప‌నిచేస్తుంది. ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి క‌లిపి తాగాలి. స‌మ‌స్య త‌గ్గుతుంది.

5. ఒక క‌ప్పు నీటిలో పావు టీస్పూన్ ప‌సుపు వేసి బాగా మ‌రిగించి డికాష‌న్ లా కాచి తాగుతుండాలి. రోజుకు రెండు సార్లు ఇలా తాగితే సైన‌స్ త‌గ్గుతుంది.

6. నీళ్ల‌ను బాగా మ‌రిగించి అందులో తురిమిన అల్లం వేయాలి. 7 నిమిషాల పాటు అలాగే ఉంచాక వ‌డ‌క‌ట్టి అందులో కొద్దిగా తేనె క‌లిపి తాగాలి. ఈ విధంగా రోజుకు రెండు సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది.

7. కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొంత దాల్చిన చెక్క పొడి వేసి క‌లిపి పేస్ట్‌లా చేయాలి. అనంత‌రం దాన్ని ముక్కుపై రాయాలి. దీంతో శ్లేష్మం క‌రుగుతుంది. నాసికా మార్గాలు క్లియ‌ర్ అవుతాయి. శ్వాస స‌రిగ్గా ఆడుతుంది. సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Tags: sinussinusitisసైన‌స్‌సైనుసైటిస్‌
Previous Post

Constipation : నిద్రించేట‌ప్పుడు ఇలా ప‌డుకోండి.. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది..!

Next Post

Bottle Gourd : సొరకాయ అని తేలిగ్గా తీసిపారేయకండి.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.