కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్‌టీఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన దేవర ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీతో తారక్ రాజమౌళి సెంటిమెంట్‌ను కూడా బ్రేక్ చేసేశాడు. రాజమౌళితో సినిమా చేశాక నెక్ట్స్ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ తారక్ విషయంలో మాత్రం ఈసారి అది రాంగ్ అని ప్రూవ్ అయింది. అయితే దేవర సక్సెస్ జోష్‌లో ఉన్న తారక్ ప్రస్తుతం వరుస చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న వార్ 2 ఈ ఏడాదిలో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో 5 నెలల సమయం మాత్రమే ఉండడంతో శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది.
వార్ 2 లో హృతిక్‌తోపాటు తారక్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఇద్దరి మీద వచ్చే కొన్ని సీన్లతోపాటు ఒక పాట కూడా పెండింగ్‌లో ఉందట. ఈ పాట ఐటమ్ సాంగ్ అని తెలుస్తోంది. ఇందులో నర్తించబోయే నటి కోసమే వేట కొనసాగిస్తున్నారట. ఈ క్రమంలోనే అన్నీ పూర్తి చేసి శరవేగంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసి, తరువాత ప్రమోషన్లను మొదలు పెట్టి, అనుకున్న తేదీ ఆగస్టు 14న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక తారక్ ఇంకో మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొనసాగుతోంది. ఈ మూవీకి తారక్ పూర్తిగా మేకోవర్ అవ్వాల్సి ఉంది. కానీ వార్ 2 పూర్తి కాకుండా అది కుదరదు. కనుక టెంపరరీగా ప్రశాంత్ నీల్ మూవీకి బ్రేక్ పడుతోంది.
వార్ 2 షూటింగ్ పూర్తయిన మరుక్షణం తారక్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం మేకోవర్ అవనున్నాడు. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ వరకు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లానింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే తారక్ తన అభిమానులకు ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో డబుల్ ట్రీట్ ఇస్తాడని అంటున్నారు. అయితే ఇదే జరిగితే అభిమానులకు అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదని చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.