ఈ రోజుల్లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు సైతం శరీరంపై కొన్ని ప్రదేశాలలో టాటూలు వేయించుకుంటున్నారు. వేరు వేరు భాషలలో కూడా ఈ టాటూలు వేయించుకుంటుండడం మనం చూస్తున్నాం. అయితే సెలబ్రిటీల టాటూస్‌కి అర్ధాలు వేరు. వాటిని తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. స్టార్ హీరోయిన్ సమంత తెలుగులో ఏ మాయ చేశావె సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు. ఈ సినిమా పేరును షార్ట్ కట్ గా సమంత “YMC” అని వీపు భాగంలో టాటూ వేయించుకున్నారు. ఆ సినిమా ఎప్పటికీ ప్రత్యేకం అని ఆ సినిమాపై ఉన్న అభిమానాన్ని సమంత ఈ విధంగా చాటుకున్నారు. వాటితో పాటు చైతూతో పెళ్లయ్యాక కూడా ఓ టాటూ వేయించుకుంది సామ్.
ఇక హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ తన ఛాతీపై సీజ్ ది డే అని టాటూ వేయించుకున్నారు. ఈ పచ్చబొట్టుకు రోజును ఆస్వాదించడం అనే అర్థం వస్తుంది. స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఛాతీపై ఎడమవైపున టాటూ వేయించుకున్నారు. 18 సంవత్సరాల వయస్సులో ఒక అబ్బాయిని ఇష్టపడిన శ్రద్ధా శ్రీనాథ్ ఆ అబ్బాయి గుర్తుగా ఈ టాటూ వేయించుకోవడం గమనార్హం. దీపికా పదుకొనే తన మెడ భాగంలో 82°e టాటూ వేయించుకుంది. దీని అర్థం ఏమిటంటే.. దీపికా సొంతంగా 82°ఈస్ట్ స్కిన్ కేర్ బ్రాండ్‌ను రన్ చేస్తోంది. ఆ బ్రాండ్ పేరును టాటూ గా వేసుకుంది.స్టార్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇటీవల తన టాటూ అర్థం చెప్పిన సంగతి విదితమే. ఆమె కాలిపై చెట్టు వేర్ల టాటూ ఉండగా మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా రూట్స్ ప్రధానమని ఆ టాటూ చెబుతుంది.
రష్మిక తన కుడి చేతిపై “irreplaceable” అనే టాటూ వేయించుకున్నారు. కాలేజ్ లో చదివే సమయంలో ఒకరిపై ఛాలెంజ్ చేసి మరీ రష్మిక ఈ టాటూ వేయించుకున్నారని తెలుస్తోంది. ఈ టాటూకు దేనినీ మరో దానితో భర్తీ చేయలేం అనే అర్థం వస్తుంది. జాన్వీ కపూర్ ఎడమ చేతిపై ఐ లవ్ యూ లబ్బూ అనే టాటూ ఉంటుంది. తల్లి శ్రీదేవి ప్రేమతో పేపర్ పై రాసిచ్చిన దానిని జాన్వీ కపూర్ టాటూలా చేతిపై ముద్రించుకున్నారు. హీరోయిన్ త్రిష తన బాడీపై మూడు చోట్ల టాటూలు వేయించుకుంది. వాటిలో ఒకటి చేతిపై ఉన్న ఆమె రాశిచక్ర గుర్తు. రెండోది ఆమెకు ఇష్టమైన కార్టూన్ పాత్ర అయిన నెమో ది ఫిష్ ,చివరగా, సినిమాపై ఉన్న తన ప్రేమకు చిహ్నంగా త్రిష తన వీపుపై కెమెరాను టాటూగా వేయించుకుంది. ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పుడు, నయనతార తన చేతిపై ఆయన పేరును టాటూగా వేయించుకుంది. విడిపోయిన తర్వాత, నయనతార ఆ టాటూను ప్రభుదేవా నుండి ‘సానుకూలత’గా మార్చుకుంది. ఇక శృతి తన వీపుపై భగవాన్ మురుగన్ ‘వేల్’ టాటూను వేయించుకుంది. ప్రియమణి చేతిపై ‘నాన్న కూతురు’ అని టాటూ వేయించుకుంది. అలానే వరలక్ష్మి శరత్‌కుమార్ తన వీపుపై పెద్ద డ్రాగన్ టాటూను వేయించుకుంది.