వినోదం

Akhanda : అఖండ సినిమాలో హీరోయిన్ పాత్ర‌ను రిజెక్ట్ చేసిన న‌లుగురు హీరోయిన్స్ వీళ్లే..!

Akhanda : నందమూరి నటసింహం బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ లాంటి చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో వేరే చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఘన విజయాన్ని సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం అఖండ. అఖండ చిత్రం కూడా విజయం సాధించి బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ కు హ్యాట్రిక్ ను అందించింది.

విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.44 కోట్ల షేర్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అఖండ చిత్రంలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రంలో మురళీకృష్ణగా, అఖండ (అఘోర) గా అద్భుతమైన నటనను కనబరిచారు. అఖండ చిత్రంలో అఘోర క్యారెక్టర్ కు హీరోయిన్ తో అవసరం ఉండదు. కానీ ఫస్ట్ హాఫ్ లో కనిపించిన బాలయ్య మురళీకృష్ణ పాత్రకు హీరోయిన్ అవసరం.

actress who rejected akhanda movie

మురళీకృష్ణ పాత్రకు భార్యగా ప్రగ్య జైస్వాల్ అత్యద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రగ్యా జైస్వాల్ కంటే ముందుగా బోయపాటి ఈ చిత్రంలో నటించడానికి బాలయ్య స్టార్ రేంజ్ ని దృష్టిలో పెట్టుకుని నలుగురు హీరోయిన్స్ ని సంప్రదించారట.

ముందుగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్, పాయల్ రాజ్ పూత్ వంటి హీరోయిన్లను సంప్రదించగా కొన్ని కారణాల వలన ఈ హీరోయిన్స్ నలుగురు బాలయ్యతో నటించడానికి నో చెప్పారట. ఈ హీరోయిన్స్ నో చెప్పడంతో ఆ చాన్స్ ప్రగ్య జైస్వాల్ ని వరించింది. ఈ క్ర‌మంలోనే సినిమా హిట్ అవ‌డంతో ప్ర‌గ్యాకు మంచి పేరు వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌గ్యాకు ఆఫ‌ర్లు రావ‌డం లేదు. మ‌రి రానున్న రోజుల్లో అయినా ఈ బ్యూటీ ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంటుందో.. లేదో.. చూడాలి.

Admin

Recent Posts