Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Aditya 369 : రూ.1.50 కోట్ల‌తో తెర‌కెక్కిన ఆదిత్య 369.. ఎంత వ‌సూలు చేసిందో తెలుసా..?

Admin by Admin
October 31, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aditya 369 : ఆదిత్య 369 సినిమా టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌గా ఈ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రం 1991 జూలై 18న విడుదలైంది. టైమ్ మిషన్ నేపథ్యంలో అప్పటి వరకు భారతీయ సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కథతో వచ్చిన ఈ సినిమా హాలీవుడ్‌లో వచ్చిన బ్యాక్ టూ ఫ్యూచర్ అనే మూవీ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందింది. మనిషి భవిష్యత్తులోకి లేదా గతంలోకి ప్రయాణిస్తే ఎలా ఉంటుంద‌నే ఆధారంగా సింగీతం శ్రీ‌నివాస‌రావు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమాతో బాలకృష్ణలో ఉన్న సంపూర్ణ నటుడిని సింగీతం బయటకు తీశారు. ఈ మూవీలో బాలయ్య అటు కృష్ణ కుమార్ గా ఇటు శ్రీకృష్ణ దేవరాయలుగా రెండు పాత్రలను వేటికవే డిఫరెంట్‌గా చేసి విమర్శల ప్రశంసలు అందుకున్నారు.

ఆదిత్య 369లో 369 అనే నంబర్ వెనుక కూడా ఒక ఆసక్తికర విషయం ఉంది. 369 అంటే పాజిటివిటి అనే అర్థం వస్తుంది. అందులో 3 అంటే మార్పు అని అర్థం. 6 అంటే కొత్త ఆరంభం అని అర్థం వస్తుంది. అదే విధంగా 9 అంటే విస్తరించడం అనే అర్థం వస్తుంది. అదే విధంగా 369 అనే నంబర్ గడియారంలో సరి సమానంగా ఉండే కాలాన్ని సూచిస్తుంది. వ‌ర్త‌మాన‌కాలంలో కృష్ణ మోహ‌న్ గా, భూత కాలంలో శ్రీకృష్ణ దేవ‌రాయ‌లుగా బాల‌య్య బాబు త‌న న‌ట‌న‌తో అల‌రించారు. ఇక దేవ‌రాయ‌ల ఆస్థానంలో తెనాలి రామ‌లింగ‌డు చెప్ప‌బోయే ప‌ద్యాన్ని బాల‌కృష్ణ ముందుగానే చెబుతాడు. ఆ ప‌ద్యం అద్భుతం.

adithya 369 movie collections

ఈ సినిమా త‌ర్వాతే కోహినూర్ వ‌జ్రం గురించి దాని విలువ గురించి అంద‌రికీ తెలిసింది. ఇక నువ్వే కావాలితో స్టార్ న‌టుడైన త‌రుణ్ ను మ‌నం మొద‌ట‌గా చూసింది ఈ సినిమాలోనే. దేవ‌రాయ‌ల ఆస్థానంలోని 8 క‌వుల‌ను ముఖ్యంగా తెనాలి రామ‌లింగ‌డి పాత్ర‌లో చంద్ర‌మోహ‌న్ ను చూసి.. ఓహో దేవ‌రాయ‌లి భువ‌న విజ‌యం ఇలా ఉంటుందా అని అంద‌రూ అనుకున్నారు. సినిమాలోని డైలాగ్స్, సుత్తివేలు కామెడీ ట్రాక్ జంధ్యాల రాసిన‌వే కావ‌డం విశేషం. సెంచ‌రీలు కొట్టే వ‌య‌స్సు మాది, జాన‌వులే నెర జాన‌వులే.., రాస‌లీల వేళ‌.. ప్ర‌తి సాంగ్ ఓ మాస్ట‌ర్ పీస్. ఇళ‌య‌రాజా మ్యూజిక్, వేటూరి, సిరివెన్నెల లిరిక్స్ అంద‌రినీ ఎంత‌గానో అల‌రించాయి. రూ.1.50 కోట్ల‌తో తీసిన ఈ సినిమా రూ.9 కోట్లు వ‌సూల్ చేసి ఇండ‌స్ట్రీ రికార్డ్ సాధించింది.

Tags: adithya 369 movie
Previous Post

ప్ర‌పంచంలోనే తొలిసారిగా డిజిట‌ల్ కండోమ్ లాంచ్.. ఇది ఎలా ప‌ని చేస్తుంది..?

Next Post

Pawan Kalyan Assets : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం..!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.