Viral Photo : పైన ఫోటోలో బోసి నవ్వులతో క్యూట్ క్యూట్ చూపులతో ఆకట్టుకుంటున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై తన వాక్చాతుర్యంతో అదరగొడుతుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఆమె ఎవరో గుర్తుపట్టారా? క్యూట్ క్యూట్ చూపులతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి మరెవరో కాదండోయ్.
బుల్లితెరపై సత్తా చాటుతోన్న అందాల యాంకరమ్మ అనసూయ. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ, తన ఫాలోయింగ్ ని కూడా అలానే పెంచుకుంటూ పోతున్న ఈ బ్యూటీ.. తన మాటలతోనే కాదు అందచందాలతోనూ ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తూనే వస్తోంది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. అంతకు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది. కానీ పెద్దగా ఎవరికీ తెలీదు. ఎప్పుడైతే జబర్దస్త్ షోకి యాంకర్ గా మారిందో.. ఆమె దశ తిరిగిపోయింది.
ప్రస్తుతం మెయిన్ లీడ్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కొన్నిరోజుల నుంచి మాత్రం పెద్దగా టీవీల్లో కనిపించట్లేదు. షోల పరంగా కనిపించప్పటికీ.. ట్విట్టర్ లో కాంట్రవర్సీలు, ఇన్ స్టాలో గ్లామరస్ ఫొటోలతో ఎప్పటికప్పుడు నెటిజన్లకు దగ్గరగానే ఉంటుంది. అనసూయ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించగా, కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమాలోనూ నటించింది. అలాగే పుష్ప 2 లోనూ కీలకపాత్ర పోషించింది.