వినోదం

Viral Photo : కృష్ణుడి గెట‌ప్‌లో క‌నిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Viral Photo : ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో హీరోయిన్స్ చిన్న‌నాటి పిక్స్ తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మ‌ల‌యాళ ముద్దుగుమ్మ పిక్ వైర‌ల్‌గా మారింది. ఉంగ‌రాల జుట్టుతో క్యూట్‌గా క‌నిపిస్తూ త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్లకు మ‌త్తెక్కించే బ్యూటీ క్వీన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. కెరీర్ తొలినాళ్లలో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించడం, పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనుపమ కెరీర్ కు శాపంగా మారింది.ఈ రీజన్ వల్లే స్టార్ హీరోలు సైతం అనుపమకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

అఆ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అనుప‌మ ఇప్పుడు మంచి హిట్ చిత్రాల‌తో అద‌ర‌గొడుతుంది. కెరీర్ తొలినాళ్లలో స్కిన్ షోకు నో చెప్పడం కూడా ఈ హీరోయిన్ కు మైనస్ అయిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అనుపమ స్కిన్ షోకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమెను పట్టించుకునే వాళ్లు లేరని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఎంత కష్టపడినా అనుపమకు స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు మాత్రం రావ‌డం రాలేదు.కార్తికేయ2 సక్సెస్ సాధించినా అనుపమ పాత్రకు మంచి మార్కులు అయితే పడలేదు.

anupama parameswaran childhood photos viral

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తోంది యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ . ఇటీవల నిఖిల్ సరసన ‘కార్తీకేయ 2’లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ క్రేజీ జంట ‘18 పేజెస్’ చిత్రంతోనూ అలరించారు.

Admin

Recent Posts