వినోదం

బాహుబలి లో చూపించినట్లు తాడిచెట్టు నిజంగానే వంగుతాయా? సైన్స్ ఏం చెబుతోంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బాహుబలి 2 &colon; టైమ్ చాలా వేగంగా వెళ్లి పోతుంది అంటే ఏమో అనుకున్నాం కానీ&period;&period; బాహుబలి 2 సినిమా వచ్చి అప్పుడే 8 ఏళ్ళు అయిపోయింది&period; నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపిస్తుంది&period; కానీ ఈ చిత్రం 2017 ఏప్రిల్ 28à°¨ విడుదలైంది&period; ప్రభాస్&comma; రానా&comma; అనుష్క&comma; తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడం కాదు… ఇండియన్ సినిమాకు కొత్త లెక్కలు చూపించింది&period; ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇండియన్ సినిమా సత్తా చూపించింది&period; ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసుకునేలా అన్నీ ఇండస్ట్రీలలో జెండా పాతేసింది బాహుబలి 2&period; 2015లో విడుదలైన మొదటి భాగమే 500 కోట్లు వసూలు చేసింది&period; అప్పుడే అంతా నోరెళ్లబెట్టారు&period; అలాంటిది రెండేళ్ల తర్వాత వచ్చిన రెండో భాగం ఏకంగా రెండు వేల కోట్లకు చేరిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇలా ఉండగా… బాహుబలి 2 పార్టు లో మనకు యుద్ధం సీన్ లో మహేంద్ర బాహుబలి బల్లాల దేవుడి కోటను బద్దలు కొట్టే సీన్ ఉంటుంది&period; ఆ సీన్ లో తాటి చెట్లను చూపిస్తారు&period; మహేంద్ర బాహుబలి తనకు ఉన్న కొద్దిపాటి సైన్యంతో బల్లాల దేవుడి కోట మీదకు యుద్ధానికి వస్తాడు&period; అయితే కోట ప్రధాన ద్వారం మూసివేస్తారు&period; దీంతో కోటలోకి కచ్చితంగా వేరే మార్గంలో ప్రవేశించాల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68168 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;palm-tree&period;jpg" alt&equals;"can palm trees bend like shown in baahubali movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు తాటిచెట్ల సహాయంతో లోపలికి చేరుకుంటారు&period; ముగ్గురు&comma; నలుగురు కలిసి జట్టుగా ఏర్పడి చుట్టూ రక్షణ కవచాలను పెట్టుకొని తాటి చెట్టును సాగదీసి విడిచిపెడతారు&period; దీంతో ఆ ఊపు&comma; వేగానికి కోటలో ఎగురుకుంటూ వెళ్లి పడతారు&period; అయితే సినిమాలో తాటి చెట్లను సులభంగా వంగేలా చేయవచ్చు&comma; అన్నట్లుగా చూపించారు&period; దీని గురించి ఎవరూ ఆలోచించలేదు&period; కానీ వాస్తవానికి తాటి చెట్లు అలా వంగుతాయా&quest; వాటిని వంచగలమా&quest; ఇందుకు సైన్స్ ఏమని సమాధానం చెబుతోంది&quest; అంటే తాటి చెట్లు వంగే గుణాన్ని కలిగి ఉంటాయి కరెక్టే&period; కానీ బాహుబలి సినిమాలో చూపించినంత రబ్బరులా వంగవు&period; కేవలం 50 డిగ్రీల కోణం వరకు మాత్రమే వంగగలవు&period; అంతకుమించి ప్రయత్నిస్తే అవి విరిగిపోతాయి&period; కనుక అలా చూపించడం సినిమాల వరకే&period; వాస్తవానికి అది సాధ్యపడదని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts