వినోదం

Chiranjeevi : ఆ సినిమాతో అమితాబ్ లాంటి స్టార్ హీరోకు చెమ‌ట‌లు ప‌ట్టించిన చిరంజీవి..!

Chiranjeevi : స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి దశాబ్దాల కాలం పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన హీరో. మెగాస్టార్ చిరంజీవి 80, 90 దశకాల్లో సాధించిన వసూళ్లు చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. చిరు బాలీవుడ్ లో సక్సెస్ కాలేదు కానీ తన సత్తా బాలీవుడ్ మొత్తం తెలిసేలా చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ చిత్రం 1989లో మార్చి నెలలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. మొదట ఈ చిత్రానికి చిరంజీవి కలసి వచ్చిన క్రేజీ డైరెక్టర్ కోదండరామిరెడ్డిని అనుకున్నారు. కానీ ఆ సమయంలో కోదండరామిరెడ్డి ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో బి గోపాల్ లైన్ లోకి వచ్చారు.

ఈ సినిమా మొదట యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇక ఆ రోజుల్లోనే ఏకంగా నైజాంలో కోటి రూపాయలకు పైగా షేర్ రాబట్టిన సినిమాగా స్టేట్ రౌడీ రికార్డు సృష్టించింది.అయితే స్టేట్ రౌడీ చిత్రం కంటే ముందుగా సంక్రాంతికి విడుదలైన చిరు చిత్రం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఘనవిజయం సాధించ‌గా, స్టేట్ రౌడీ చిత్రాన్ని కొనేందుకు బయ్యర్లు బ్లాంక్ చెక్కులతో నిర్మాత సుబ్బిరామిరెడ్డి వద్దకు వెళ్లారట. భారీ అంచనాలతో స్టేట్ రౌడీ విడుదలైంది. మొదట ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ రాగా, . నెమ్మదిగా పుంజుకొని వసూళ్ల రికార్డులు తిరగరాస్తూ అద్భుత విజయం సాధించింది.

chiranjeevi got blockbuster hit with state rowdy movie

కేవలం నైజాం ఏరియాలోని అప్పట్లో ఈ చిత్రం రూ.1 కోటి వసూలు చేయ‌గా, స్టేట్ రౌడీ ప్రభంజనం చూసి ముంబైలో బాలీవుడ్ వర్గాలు షాక్ కి గురయ్యారు. స్టేట్ రౌడీ వసూళ్ళని అమితాబ్ సినిమాలతో పోల్చుతూ ప్రముఖ ముంబై మ్యాగజైన్ ‘వేర్ ఈజ్ అమితాబ్’ అనే ఆర్టికల్ ప్రచురించింది. అదే స‌మ‌యంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ‌చ్చ‌న్ హీరోగా ఓ సినిమా విడుద‌ల కాగా, ఆ సినిమాకి చిరు సినిమా క‌లెక్ష‌న్స్ క‌న్నా తక్కువ వ‌చ్చాయి. స్టేట్ రౌడీ 100 రోజుల వేడుకకు రజనీకాంత్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ తర్వాతి సంవత్సరాలలో వచ్చిన గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు లాంటి చిత్రాలు చిరంజీవి బాక్సాఫీస్ సత్తాని తారా స్థాయికి చేర్చిన విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే.

Admin

Recent Posts