Chiranjeevi Net Worth : తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయం కృషితో ఎదిగిన స్టార్ హీరో ఎవరు.. అంటే మనకు మెగాస్టార్ చిరంజీవి పేరు ఠక్కున గుర్తుకు వస్తుంది. ఆయన ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ డమ్ సంపాదించారు. కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలుగా రాణిస్తున్నారు. ఇదంతా చిరంజీవి చలవే అని చెప్పవచ్చు. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ సినిమాల్లో మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. ఏడాదికి ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తున్నారు.
చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నారు. కరోనా నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ఆయన ఇరు రాష్ట్రాల సీఎంలను కలిసి సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారు. ప్రస్తుస్గ్ చిరంజీవి పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికే చాలా మందికి తెలుసు. కానీ ఆయనకు అసలు ఎంత ఆస్తి ఉంది అన్న వివరాలు మాత్రం చాలా మందికి తెలియవు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆయన ఆస్తి విలువ ఎంతో తెలుసుకోవాలని చూస్తున్నారు. ఈ మేరకు నెట్‌లోనూ సెర్చ్ చేస్తున్నారు. అయితే చిరంజీవికి సుమారుగా రూ.1000 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
చిరంజీవి అప్పట్లోనే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఆయన దగ్గర అప్పట్లో ఉన్న కార్ల కలెక్షన్ చూసి అందరూ షాకయ్యేవారు. ఇక ప్రస్తుతం ఆయన ఒక్కో మూవీకి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్‌లో తనకు రూ.33 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికి ఆయన ఆస్తులు ఇంకా భారీగా పెరిగి ఉంటాయని అంటున్నారు. ఆయన ఆస్తి విలువ రూ.1000 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. అప్పట్లో మా టీవీలో ఆయన తన వాటాను విక్రయించాకే భారీగా ఆస్తులు వచ్చాయని సమాచారం.
ఆచార్య మూవీ వల్ల తీవ్రంగా నష్టాలు రావడంతో చిరంజీవి తన రెమ్యునరేషన్‌ను వెనక్కి ఇచ్చేయడంతోపాటు నష్టాలను భర్తీ చేసేందుకు రూ.45 కోట్లు ఇచ్చారని.. అందుకు గాను జూబ్లీహిల్స్‌లో తన ప్రాపర్టీని అమ్మారని కూడా వార్తలు వచ్చాయి. ఇక చిరు తనయుడు చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌ను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.