Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

శోభన్ బాబు, జయలలితకు ఒక కూతురు ఉన్నది నిజమేనా ..?

Admin by Admin
November 6, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పురచ్చితలైవిగా పేరుగాంచిన జయలలిత తమిళ రాజకీయాలను కంటిచూపుతోనే శాసించారు. కన్నడనాట జన్మించి తమిళనాడులో స్థిరపడి వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. రాజకీయాల్లోకి ప్రవేశించి తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. 14 ఏళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత.. తమిళులతో అమ్మ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. జయలలిత రాజకీయాలలోకి రాకముందు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారుగా 140 సినిమాల్లో నటించించారు. కొద్దికాలం తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా ఏలారు.

ఆమె నటిగా ఎంజీఆర్ సరసన ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. ఎంజీఆర్ మరణాంతరం అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. ఎంజీఆర్, జయలలిత తమిళ ఇండస్ట్రీలో ది బెస్ట్ పెయిర్ గా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ కలిసి దాదాపుగా 28 చిత్రాల్లో కలిసి నటించారు. 1970 ప్రాంతంలో ఎంజీఆర్.. జయలలితను కాకుండా చంద్రకళ, మంజుల, లత కథానాయికలుగా ఓ తమిళ చిత్రంలో ఎంజీఆర్ నటించారు. తనను కాదని వేరే కథానాయికలతో ఎంజీఆర్ నటించడం జయలలితకు నచ్చలేదు. ఆ క్రమంలో జయలలిత, ఎంజీఆర్ మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత జయలలితకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో (1973) శోభన్ బాబుతో నటించే అవకాశం వచ్చింది. అలా శోభన్ బాబు, జయలలిత కలిసి డాక్టర్ బాబు చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో శోభన్ బాబుతో సాన్నిహిత్యం పెరిగింది.

did shobhan babu and jayalalitha have daughter

1979 లో స్టార్ అండ్ స్టైల్ అనే ఓ ఇంగ్లిష్‌ పత్రిక వీరి రహస్య అనుబంధం గురించి రాసింది. ఆ ఇంగ్లిష్‌ ఆర్టికల్ ని తమిళనాట బాగా పేరు పొందిన కుముదం పత్రిక తమిళంలోకి అనువదించింది. దానికి స్పందించిన జయలలిత.. శోభన్ బాబు తనకు మధ్య బంధం ఉందని.. ఒకరి బాధలు, భావాలు పంచుకునేంత దగ్గరని అది ఎంతో పవిత్రమైన అనుబంధమని.. శోభన్ బాబును తను కలిసే నాటికి ఆయన వివాహితుడని కావున ఆయన సతీమణికి ద్రోహం చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తరువాత‌ వారి రహస్య అనుబంధం గురించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో వదంతులతో కూడిన వార్తలు దినపత్రికల‌లో వచ్చాయి. శోభన్ బాబు, జయలలిత మధ్య ఆ రహస్య అనుబంధం ఏమిటి అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో అలనాటి నటి సత్యప్రియ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. శోభన్ బాబు, జయలలిత మధ్య రహస్య అనుబంధం గురించి ఆమెను అడగగా.. జయలలిత పర్సనల్ మేకప్ మెన్ తనకు కూడా మేకప్ మెన్ గా పని చేశాడ‌ని, శోభన్ బాబు, జయలలిత మధ్య అనుబంధం నిజమేనని.. కానీ వారిద్దరికీ కల‌సి ఒక కూతురుకు జన్మించిందనేది అవాస్తవమని మేకప్ మెన్ చెప్పారని.. సత్యప్రియ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Tags: jayalalithashobhan babu
Previous Post

Ganga Jalam : ఇంట్లో గంగాజలం ఉందా.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..

Next Post

Health Tips : ఈ 27 సూత్రాల‌ను పాటిస్తే చాలు.. ఆరోగ్యంగా ఉంటారు.. ఎలాంటి రోగమూ రాదు..!

Related Posts

వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025
వినోదం

RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

July 13, 2025
వైద్య విజ్ఞానం

పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!

July 13, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు అర్థ‌నారీశ్వ‌రుడు ఎలా అయ్యాడు..?

July 13, 2025
ఆధ్యాత్మికం

ఎలాంటి ప్ర‌మిద‌తో దీపారాధ‌న చేస్తే ఏ ఫ‌లితం క‌లుగుతుందో తెలుసా..?

July 13, 2025
ఆధ్యాత్మికం

దైవానికి ప్ర‌సాదం ఎందుకు పెడ‌తారు..? అందులో ఉన్న ప్రాధాన్య‌త ఏమిటి..?

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.