వినోదం

KR Vijaya : న‌టి కె.ఆర్.విజ‌య కూతురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని తెలుసా.. ఆమె ఎవ‌రంటే..?

KR Vijaya : ఆ తరం హీరోయిన్లలో కె ఆర్ విజయ ఒకరు. సావిత్రి జమున వంటి వారితో సమానంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఈ నటి అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో దేవత పాత్ర అంటే ప్రతి ఒక్కరికి కె.ఆర్.విజయ గుర్తుకొస్తుంది. ఆమె అంతలా దేవత పాత్రల్లో ఇమిడిపోయింది. తెలుగు, తమిళ్ ,మలయాళం వంటి సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఈమెకు సంబంధించిన వాళ్ళు సినీ ఇండస్ట్రీలో ఎవరూ లేరని అనుకుంటుంటారు.

కానీ తన కూతురు, చెల్లెళ్లు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వారు ఎవరు..? ఏ సినిమాలో నటించారో చూద్దాం.. కేఆర్ విజ‌య చెల్లి సావిత్రి మ‌ల‌యాళంలో హీరోయిన్ గా న‌టించారు. అయితే సావిత్రి కేవ‌లం మ‌ల‌యాళ సినిమాలకు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. కేఆర్ విజ‌య తండ్రి ఏపీకి చెందిన వ్య‌క్తి కాగా ఆమె త‌ల్లి కేర‌ళ రాష్ట్రానికి చెందిన‌వారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఇదిలా ఉంటే కేఆర్ విజ‌య ఇద్ద‌రు కూతుళ్లు కూడా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె కూతురు అనూష హీరోయిన్ గా ప‌రిచ‌యం అయ్యారు. అంతే కాకుండా మ‌రో కూతురు మ‌ణిరాగ సుధ కూడా న‌టిగా ప‌రిచ‌యం అయ్యారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల్లో న‌టించారు.

do you know about kr vijaya daughters

కేవ‌లం కూతుళ్లు, చెల్లెల్లే కాదు కెఆర్ విజ‌య బంధువుల్లో కూడా చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇదిలా ఉంటే కేఆర్ విజ‌య కూతురు అనూష‌ ప‌ద‌మూడేళ్ల‌కే మ‌ల‌యాళంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులోనూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేశారు. ఇద్ద‌రు పెళ్లాల ముద్దుల పోలీస్, గోల్ మాల్ గోవిందంతో పాటూ మ‌రికొన్ని సినిమాల్లో న‌టించినా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు అనూష చేరుకోలేదు. ఇక ప్ర‌స్తుతం అనూష క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతున్నారు. అంతేకాకుండా సినిమాల కంటే ఎక్కువ‌గా సీరియ‌ల్స్ లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు.

Admin

Recent Posts