తన స్టైల్, డ్యాన్స్, యాక్టింగ్ తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఊహించని వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలలో అల్లు అర్జున్ స్టైల్ ఆఫ్ యాక్షన్ కు దేశం మొత్తం ఫిదా అయింది. అయితే గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అయితే అల్లు అర్జున్ చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు.
అందులో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ మూవీలు కావడం విశేషం. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రెండు సినిమాలలో బాలనటుడిగా నటించిన అల్లు అర్జున్ తన నటనతో అభిమానులను మెప్పించారు. ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విజేత సినిమా కాగా.. మరొకటి లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన స్వాతి ముత్యం సినిమాలో అల్లు అర్జున్ కమల్ హాసన్ మనవడిగా నటించారు. ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులను సొంతం చేసుకుంది. ఇవేకాక అల్లు అర్జున్ సినిమాలలోకి రాకముందు మెగాస్టార్ హీరోగా నటించిన డాడీ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించారు.
అయితే బన్నీ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పుష్ప 2 మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో బన్నీ తన తరువాత సినిమాను ఏ దర్శకుడితో చేస్తారు.. అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై త్వరలోనే అప్ డేట్ రానున్నట్లు సమాచారం.