Anchor Suma House : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు సుమ. కొన్ని దశాబ్ధాలుగా తన యాంకరింగ్‌తో ప్రేక్షకులని అలరిస్తూ వస్తుంది. ఏ షో చూసినా, ఈవెంట్ చూసినా సుమ తప్పక కనిపిస్తుంది.. ఆమె ఒక మాటల మాంత్రికురాలు. ఓవైపు ఇండస్ట్రీలో తన కెరీర్ ని మంచిగా రాణిస్తూనే మరోవైపు ఫ్యామిలిని కూడా మంచిగా లీడ్ చేస్తుంది సుమ. నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అలా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తిరుగులేని యాంకర్ గా పేరు సంపాదించింది. సుమ జయమ్మ పంచాయతీ సినిమాలో నటిగా రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
సుమ ఇటీవల సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇంటికి, ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. సుమ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్నో సినిమాలు సుమ ఇంట్లోనే షూటింగ్ చేసినట్లుగా ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఏ ఏ సినిమాలు సుమ ఇంట్లో సందడి చేశాయో తెలుసా… నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 100% లవ్ సినిమా షూటింగ్ ఎక్కువగా సుమ ఇంట్లోనే జరిగిందట. ఇక ఎన్టీఆర్, శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన బాద్ షా సినిమా లో కాజల్ అగర్వాల్ ఇల్లు సుమ ఇల్లేనట.
బ్రూస్ లీ సినిమా లో రామ్ చరణ్ ఇల్లుగా కూడా సుమ ఇంటినే వాడారు. మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో మహేష్ బాబు- ప్రకాష్ రాజ్ ఉన్న ఇల్లు, సునీల్ నటించిన పూలరంగడు సినిమాలో విలన్ ఇల్లు కూడా సుమ ఇల్లేనట. ఇలా చాలా సినిమాల్లో షూటింగ్ లకు సుమ ఇంటిని వాడినట్టు తెలుస్తుంది. సుమ ఇల్లు చాలా అందంగా ఉండడంతో పాటు సినిమా షూటింగ్ కు చాలా అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఆమె ఇంటిని షూటింగ్‌కి వాడారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.