వినోదం

ఏంటి.. ఉద‌య్ కిర‌ణ్ సినిమాలు ఇన్ని ఆగిపోయాయా..? అదేనా ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం..?

తెలుగు చిత్రసీమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోలకే చెమటలు పట్టించే విధంగా ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు ఉదయ్ కిరణ్. ఎన్నో లవ్ బేస్డ్ సినిమాలు తీసి అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు ఉదయ్.. ఆయన తీసిన “మనసంతా నువ్వే” సినిమా అప్పట్లో హ్యాట్రిక్ విజయం సాధించింది. ఇక ఈ మూవీ ద్వారా ఉదయ్ కిరణ్ తిరుగులేని హీరోగా మారాడని చెప్పవచ్చు.. అలా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సమయంలో ఉదయ్ కిరణ్ కు ఒక చేదు అనుభవం ఎదురైంది. మెగాస్టార్ కూతురితో ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ జరగడం, ఆ తర్వాత పెళ్లి రద్దు కావడం, దీంతో ఉదయ్ కిరణ్ మెడచుట్టు వివాదం నెలకొంది..

స్టార్ హీరోగా ఉన్న ఉదయ్ కిరణ్ అప్పటి నుంచి క్రమక్రమంగా తగ్గుతూ డిప్రెషన్ కు లోనయ్యారు.. అయితే అప్పట్లో వీరిద్దరి పెళ్లిని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెడగొట్టారని కూడా వార్తలు వచ్చాయి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయన మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారని తెలియడంతో వరుస అవకాశాలు తన్నుకు వచ్చాయి. కానీ పెళ్లి రద్దయిందని తెలియడంతో తనకు వచ్చిన సినిమాలన్నీ రద్దు అయిపోయాయి. కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ఈ క్రమంలో ప్రత్యూష బ్యానర్లో ఓ చిత్రం ప్రారంభమైంది, దీని తర్వాత బాలకృష్ణ దర్శకత్వంలో నర్తనశాలలో అభిమన్యుడు పాత్ర ఇచ్చి సినిమాను స్టార్ట్ చేశారు. అలాగే చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్లో మిలిటరీ ఆఫీసర్ గా ఇంకో సినిమా ను కూడా ప్రారంభించారు..

do you know how many uday kiran movies were stopped

అలాగే సూపర్ గుడ్ ఫిలింస్ ఉదయ్ కిరణ్ సదా జంటగా లవర్స్ అనే సినిమాను కూడా ప్రారంభించారు. దీని తర్వాత సూర్య మూవీస్ బ్యానర్ మీద ప్రేమంటే సులువు కాదురా చిత్రం మొదలైంది. ఆ తర్వాత నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభించారు.. సద్గురు ఆదిశంకరాచార్య ఇంకో సినిమా కూడా ప్రారంభించారు. దీంతో పాటుగా బాలీవుడ్లో ఒక సినిమా ప్రారంభమై ఒక్కసారి ఆగిపోవడంతో ఉదయ్ కిరణ్ తీవ్రమైన డిప్రెషన్ కు లోనై అనేక ఇబ్బందుల పాలయ్యారు.. ఒత్తిడిని తట్టుకోలేక 2014లో ఉదయ్ కిరణ్ ఉరి వేసుకుని చనిపోయారు..

Admin

Recent Posts