గతంలో సిల్వెస్టర్ స్టాలోన్ ఒక పేరు తెలియని చిన్న నటుడు. ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉండేవాడు. ఒక దశలో, అతను తన భార్య నగలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. పరిస్థితులు ఇంతగా దిగజారిపోయాయి, అతను తిండి లేక, అద్దె చెల్లించలేక, మూడు రోజులు న్యూయార్క్ బస్ స్టేషన్ లో పడుకున్నాడు. తన కుక్కకు ఆహారం పెట్టలేక, చివరికి ఒక మద్యం షాపు బయట ఆ కుక్కను $25కి ఒక వ్యక్తికి అమ్మేశాడు. ఏడుస్తూ వెళ్లిపోయినట్టు చెప్పాడు. ఇంకా రెండు వారాలు గడిచిన తర్వాత, అతను మొహమ్మద్ అలీ వర్సెస్ చక్ వెప్నర్ బాక్సింగ్ మ్యాచ్ చూశాడు. అదే మ్యాచ్ అతనికి రాకీ అనే సినిమాకి స్క్రిప్ట్ రాయాలనే ప్రేరణ ఇచ్చింది. 20 గంటల్లోనే రాసేశాడు!
ఆ స్క్రిప్ట్‌ను విక్రయించడానికి వెళ్లాడు. మొదట అతనికి $1,25,000 ఆఫర్ చేశారు. కానీ అతను ఒకటే కోరిక పెట్టాడు — హీరోగా తానే నటించాలని. స్టూడియో కుదరదు అని చెప్పింది. నువ్వు ఫన్నీగా కనిపిస్తావ్, మాట్లాడతావ్ అన్నారు. అతను నిరాకరించాడు. తర్వాత వారు $2,50,000, తర్వాత $3,50,000 వరకు కూడా ఇచ్చారు. కానీ అతను నిరాకరించాడు. చివరకు వారు ఒప్పుకుని, స్క్రిప్ట్‌కి $35,000 ఇచ్చి, రాకీ పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఎడిటింగ్ వంటి ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. స్టాలోన్ కూడా బెస్ట్ యాక్టర్‌కు నామినేట్ అయ్యాడు. రాకీ సినిమా అమెరికన్ ఫిల్మ్ హిస్టరీలో నిలిచిపోయింది.
పాఠం: ప్రపంచం మీలో ఉన్న శక్తిని గమనించదు. వారు మీ రూపాన్ని చూస్తారు, మీరు కలిగి ఉన్నదాన్ని చూస్తారు. కానీ మీరు మాత్రం నమ్మకంతో పోరాడాలి! ఎప్పుడూ వదలకండి. మీరు బతికే ఉంటే, మీ కథ ఇంకా ముగియలేదు! ఆఖరికి: సినిమా విడుదల తర్వాత, స్టాలోన్ తన కుక్కను అమ్మిన వ్యక్తిని వెతికాడు. ఆ కుక్కను తిరిగి కొనడానికి అతను $10,000 చెల్లించాడు! సందేశం: పదిలంగా ఉండండి. కలలు కనండి. వాటికోసం పోరాడండి!