వినోదం

Chiranjeevi : టాలీవుడ్ కింగ్ అని మెగాస్టార్‌ను అందుక‌నే అంటారు.. ఎవ‌రికీ ద‌క్క‌ని రికార్డులు ఆయ‌న‌కే సొంతం..!

Chiranjeevi : టాలీవుడ్ లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి హీరోలు చేయలేని డ్యాన్సులు, ఫైట్లతో ప్రేక్షకులకు కొత్తతరం హీరోయిజాన్ని పరిచయం చేసిన చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగాడు. తెలుగు పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే, చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకునే అంత ఘనత మెగాస్టార్ కి మాత్రమే దక్కుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టి ఇండియాలో ఏ హీరో చేర‌లేని శిఖరాలను అందుకున్నాడు. ఎన్నో రికార్డులు, అద్భుతాల‌ను క్రియేట్ చేశాడు. ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాని చాలా రికార్డులను క్రాస్ చేసిన రికార్డు చిరంజీవికే ఉంది.

ఇండియాలో షోలే లాంటి సినిమాతో మంచి గుర్తింపు సాధించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ కంటే ఫస్ట్ టైం ఎక్కువ పారితోషికం అంటే ఒక సినిమాకి రూ.1.25 కోట్లు తీసుకున్న తెలుగు హీరోగా గుర్తింపు పొందాడు. లగాన్ సినిమా కోసం అమీర్ ఖాన్ రూ.6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా ఆ రికార్డ్ ని క్రాస్ చేస్తూ చిరంజీవి రూ.7 కోట్లు తీసుకుని ఇండియా రికార్డు క్రియేట్ చేశాడు.

do you know that chiranjeevi holds these records

ఖైదీ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, ఘరానా మొగుడు, ఇంద్ర లాంటి సినిమాలతో 8 ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. అంతేకాదు, ఇండస్ట్రీలో 7 ఫిలిం ఫేర్ అవార్డులు తీసుకున్న ఏకైక హీరోగా గుర్తింపు పొందాడు. ఇక సౌత్ ఇండియా నుంచి ఆస్కార్ అవార్డ్స్ కు ఆహ్వానించబడ్డ తొలి హీరో చిరంజీవి కావడం మరో అరుదైన రికార్డు. ఘరానా మొగుడు సినిమాతో ఫస్ట్ టైం రూ.10 కోట్లు వసూలు చేసిన సినిమాగా గుర్తింపు పొండమే కాక ఇంద్ర సినిమాతో ఫస్ట్ టైం రూ.30 కోట్లు కొల్లగొట్టిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా ఎన్నో అరుదైన రికార్డుల‌ను టాలీవుడ్‌లో కేవ‌లం చిరంజీవి మాత్ర‌మే సొంతం చేసుకున్నారు.

Admin

Recent Posts