Yamaleela : ఆలీ కెరీర్‌ని మార్చేసిన చిత్రం యమలీల. సోషియో ఫాంటసీ సినిమాగా యమలీల తెరకెక్కడం గమనార్హం. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అలీ స్టార్ హీరోలకు వణుకు పుట్టించారు. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తొలిరోజు యావరేజ్ టాక్ ను సంపాదించుకున్న ఆ తర్వాత పుంజుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్లను సంపాదించుకుంది. నిర్మాతలకు భారీ లాభాలను అందించింది.ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారనే చెప్పాలి.
యమలీల చిత్రం ఆలీని ఓ రేంజ్‌లో నిలబెట్టిందని చెప్పక తప్పదు. అయితే మహేష్ బాబు దయవల్లే అలీ హీరోగా అయ్యాడని. మహేష్ బాబు ఆ రోజు ఎస్ అని చెప్పుంటే అలీ కథ మరోలా ఉండేది. అసలు ముందుగా ఈ కథను మహేశ్ బాబును దృష్టిలో పెట్టుకొని రాసాడట కృష్టారెడ్డి. కానీ అప్పటికీ మహేశ్ చిన్నపిల్లవాడే అని హీరోగా సినిమా చేయడని కృష్ణ చెప్పేసారట. అయితే మహేష్ హీరో అని చెప్పడంతో సౌందర్య హీరోయిన్‌గా చేసేందుకు ఓకే చెప్పింది. కాని తర్వాత హీరోగా ఆలీ రావడంతో సౌందర్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె స్థానాన్ని ఇంద్రజ భర్తీ చేసింది. ఈ సినిమాతో ఆలీ, ఇంద్రజ మంచి పేరు తెచ్చుకున్నారు.
యమలీల చిత్రం నైజాం, సీడెడ్, ఆంధ్ర తదితర ప్రాంతాల్లో పలు థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడింది. అయితే యమలీల చిత్రాన్ని తెరకెక్కించిన 20 సంవత్సరాల తరువాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మళ్లీ 2014 సంవత్సరంలో యమలీల2 చిత్రాన్ని తీశాడు. కానీ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. యమలీల సినిమా చూసిన తరువాత ఆలీ నాన్న కూడా.. ఏరా ఆలీ పిలవడం మానేసి.. ఆలీ గారు అని అనడం ప్రారంభించారట. ఈ సినిమాకు ఆలీ పది వేల పారితోషికం అందుకున్నాడట. ఈ విషయాన్ని ఆలీనే స్వయంగా బయటపెట్టారు.