ప్రజెంట్ సమంత, ఆలియా భట్, ధనుష్ ఇలా చాలామంది నటీనటులు హాలీవుడ్ మూవీస్ లో నటిస్తున్న వారే. హాలీవుడ్ లో నటించడం అంటే మామూలు విషయం అయితే కాదు. గతంలో కూడా మన భారత నటులు హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ విషయం మన భారతీయులకు చాలా మందికి తెలియదు. మరి హాలీవుడ్ లో నటించిన మన భారతీయ నటీనటులు ఎవరో ఒకసారి చూద్దాం.
ఆలియా భట్ :
హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ కిల్లర్ మూవీ లో యాక్ట్ చేసింది అలియాభట్. మూవీ రిలీజ్ కాలేదు.
సమంత :
అలాగే సమంత కూడా “అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్” అనే మూవీలో బైసెక్సువల్ పాత్రలో నటించింది.
ఐశ్వర్యరాయ్ :
ది లాస్ట్ లీజియాన్, ప్రైడ్ అండ్ ఫ్రి జస్టిస్ ఇంకా అనేక హాలీవుడ్ చిత్రాల్లో నటించింది.
ధనుష్:
దా ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ పకీర్ , ద గ్రే మ్యాన్ వంటి సినిమాల్లో నటించారు.
అమితాబచ్చన్ :
ద గ్రేట్ గాడ్స్ బై అనే చిత్రంలో నటించారు.
అనుపమ్ ఖేర్ :
ఇండియా లోని అద్భుత నటుల్లో ఒకరైన అనుపమ్ సిల్వర్ లైనింగ్స్ ప్లే బుక్, మిడ్నైట్ చిల్డ్రన్ అనే హాలీవుడ్ చిత్రాల్లో నటించారు.
ప్రియాంక చోప్రా :
ప్రియాంక చోప్రా అప్పట్లోనే క్వాంటికో, బేవాచ్ వంటి సినిమాల్లో నటించి హాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
దీపికా పదుకొనే :
ఈ అమ్మడు హాలీవుడ్లో త్రిబుల్ ఎక్స్ సినిమాలో చేసింది.
అమ్రిష్ పురి :
ఈయన హాలీవుడ్లో ఇండియానా జోన్స్ ఆన్ ద టెంపుల్ ఆఫ్ డోన్ అనే మూవీ లో విలన్ గా నటించారు.
రజినీకాంత్ :
సూపర్ స్టార్ రజనీకాంత్ హాలీవుడ్లో బ్లడ్ స్టోన్ అనే మూవీ లో నటించారు.