1. తరుణ్ – నువ్వే కావాలి
తరుణ్ హీరోగా త్రివిక్రమ్ రచయితగా విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వేకావాలి సినిమా తో హీరోగా సక్సెస్ అయ్యాడు తరుణ్. తరుణ్ కెరీర్లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం.
2. ఉదయ్ కిరణ్ – చిత్రం
తేజ దర్శకత్వం లో ఉదయ్ కిరణ్ మరియు రీమాసేన్ హీరోహీరోయిన్లుగా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా బాక్సాఫీసు ముందు సంచలన విజయం సాధించింది.
3. నితిన్ – జయం
జయం సినిమా పేరు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించగా సదా హీరోయిన్ గా నటించింది.. 2002 జూన్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
4. అల్లు అర్జున్ : గంగోత్రి
హీరోగా గంగోత్రి మూవీ లో ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు బన్నీ. గంగోత్రి మూవీ నుంచి ఇప్పటివరకు తిరుగులేని హీరోగా ఎదిగాడు ఈ మెగా హీరో.
5. రామ్ పోతినేని – దేవదాస్
రామ్ పోతినేని దేవదాసు సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమా వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కింది. అప్పట్లో దేవదాసు సినిమా చరిత్రను తిరగరాసింది.