ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు సంపాదించుకొని వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన స్వర్గీయ ఉదయ్ కిరణ్ చెల్లెలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకుంది. మరి ఆమె ఎవరు ఆమె నేపథ్యం ఏమిటి అనేది ఓ సారి చూద్దాం… ఆ హీరో చెల్లెలు మనందరికీ తెలిసిన స్టార్ సింగర్. ఆవిడే పర్ణిక మాన్య ఈమె పేరు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే సినిమా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి.
ఈ సినిమాలో పాటలు పాడి స్టార్ సింగర్ గా పేరు తెచ్చుకుంది పర్ణిక. ఈ సినిమా పాటలతో ఆమె ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లాకు చెందిన పర్ణిక, డిగ్రీ పూర్తి చేసింది. ప్రముఖ లైట్ మ్యూజిక్ సంగీత ఆచార్యులైన రామాచారి దగ్గర లైట్ మ్యూజిక్ లో శిక్షణ తీసుకుంది. అలాగే కర్ణాటక సంగీతంలో కూడా శిక్షణ పూర్తి చేసింది. చాలా టీవీ షోలో పాల్గొంది. పర్ణిక దాదాపు అరవై పైగా సినిమాల్లో పాటలు పాడి అందరినీ మెప్పించింది.
కేవలం సింగల్ గానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది పర్ణిక. ఇండస్ట్రీ లో ఈమె బెస్ట్ ఫ్రెండ్ గీతామాధురి. లాక్ డౌన్ సమయంలో ఇద్దరు కలిసి చేసిన ఎన్నో వీడియోలు ప్రేక్షకులను చాలా అలరించాయి. పర్ణిక మాన్య అన్న ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో అయినా ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ పర్ణిక మాన్య కు అన్నయ్య వరస అవుతారట. పరిణిక పెదనాన్న కొడుకు ఉదయ్ కిరణ్.