సినిమా అనగానే ఎవరైనా సరే హీరో ఎవరు అని అడుగుతారు. సినిమా వాల్ పోస్టర్ మీద హీరోయే క్రౌడ్ పుల్లర్. సినిమాలో హీరో పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మనం ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో హీరోలు, హీరోయిన్లు చనిపోయినప్పుడు మనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సినిమాలలో హీరో మరణించడంతో అభిమానులు నిరాశగా బయటకు వస్తూ ఉంటారు. అయితే ఇలా హీరో పాత్రలు చనిపోయిన కొన్ని సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.. 1) గమ్యం – అల్లరి నరేష్: జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో 2008లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్కౌంటర్ లో అభిరామ్, అతని స్నేహితుడు గాలి శీను తప్పించుకునే ప్రయత్నంలో శీను మరణిస్తాడు.
2) నేనే రాజు నేనే మంత్రి – రానా: తేజ దర్శకత్వంలో 2017లో వచ్చిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి హీరోగా, కాజల్ అగర్వాల్, కేథరిన్ హీరోయిన్లు గా నటించారు. ఈ చిత్రంలో జోగేంద్ర తనకు తానుగా ఉరి వేసుకుని మరణిస్తాడు. 3) మేజర్ – అడివి శేష్: శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రంలో టెర్రరిస్టుల ఎటాక్ లో సందీప్ మరణిస్తారు. 4) నిన్నే ప్రేమిస్తా – నాగార్జున: ఎస్ ఏ రాజ్ కుమార్ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రంలో ఓ బస్సు ప్రమాదంలో ఆర్మీ ఆఫీసర్ గా హీరో మరణిస్తారు.
5) బాహుబలి – ప్రభాస్: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2015 వ సంవత్సరంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కట్టప్ప, బాహుబలిని వెన్నుపోటు పొడుస్తారు. 6) వేదం – అల్లు అర్జున్ మరియు మంచు మనోజ్: క్రిష్ దర్శకత్వంలో 2010లో విడుదలైన ఈ సినిమాలో ఉగ్రవాదుల నుంచి ప్రజలను కాపాడేందుకు ఇద్దరు హీరోలు ప్రాణాలను అర్పిస్తారు. 7) ఎవడే సుబ్రహ్మణ్యం – విజయ్ దేవరకొండ: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 2017లో వచ్చిన ఈ చిత్రంలో దూద్ కాశీకిి వెళ్లాలనుకున్న రిషి హఠాత్తుగా జరిగే సంఘటనలో మరణిస్తారు. 8) చక్రం – ప్రభాస్: కృష్ణవంశీ దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ చిత్రంలో బ్లడ్ క్యాన్సర్ కారణంగా చక్రం మరణిస్తారు. 9) భీమిలి కబడ్డీ జట్టు – నాని: తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కబడ్డీ ఆటలో క్లైమాక్స్ లో సూరి మరణిస్తారు. 10) జెర్సీ – నాని: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 2019లో తెరకెక్కిన ఈ చిత్రంలో క్లైమాక్స్ లో క్రికెట్ మ్యాచ్ అనంతరం హీరో కుప్పకూలిపోతాడు.