వినోదం

Chitram Bhalare Vichitram : చిత్రం భ‌ళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

Chitram Bhalare Vichitram : యాక్షన్ , మాస్ సినిమాలకు ఉండే ఇమేజ్ హాస్యం జోడించిన సినిమాలకు కష్టం. అయితే హాస్యం మేళవించిన మూవీస్ చేస్తూ హిట్స్ అందుకున్న హీరోగా నరేష్ కి పేరుంది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న నరేష్ ఒకప్పుడు కామెడీ హీరోగా దుమ్మురేపాడు. అందులో ప్రధానంగా చిత్రం భళారే విచిత్రం మూవీ ఓ చిన్న సినిమాగా వచ్చి అఖండ విజయాన్ని అందుకుంది. తోటపల్లి మధు, సాంబశివరావు రచయితలుగా పనిచేసిన ఈ సినిమాను పిఎన్ రామచంద్రరావు డైరెక్ట్ చేసాడు. హైదరాబాద్ శ్రీనివాస్ థియేటర్ లో ఈ మూవీ ఏకధాటిగా 175డేస్ ఆడింది. నరేష్ లేడీ గెటప్ వేస్తె, అందుకు అనుగుణంగా రోజా రమణి డబ్బింగ్ చెప్పారు.

మరాఠీ మూవీ ఆధారంగా చిత్రం భళారే విచిత్రం మూవీ తెరకెక్కించారు. పెళ్లికాని కుర్రాళ్లకు ఇల్లు అద్దెకు దొరక్కపోతే అమ్మాయి వేషం వేయడం, ఓ ఇంట్లో అద్దెకు దిగడం, ఈ అంశాల చుట్టూ అల్లుకున్న ఈ కథ నిజంగా చిత్రంగానే ఉంటుంది. భళా అనిపించుకుంది. ఇంటి యజమాని కూతురిని ప్రేమించే ప్రేమికుడిలా, ఇల్లు అద్దెకు తీసుకునే అమ్మాయిలా నరేష్ నటన అద్భుతం.

do you know these facts about chitram bhalare vichitram movie

రాజా పాత్రలో ఒదిగిపోయాడు. ఆడవేషంలో అచ్చం తల్లి విజయనిర్మలను తలపించాడు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయింది. శుభలేఖ సుధాకర్ పెళ్ళాం వేషంలో రాజా వస్తే, సుధాకర్ ని ప్రేమించిన అమ్మాయి కి తేడా కొడుతోంది. మొత్తానికి అన్నీ సరిచేసి, కథ సుఖాంతం చేసిన తీరుకి చిత్రం భళారే విచిత్రం మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది.

ఎన్టీఆర్ నటించిన దానవీర శూర కర్ణ మూవీలో దుర్యోధనుడికి, భానుమతికి పెట్టిన సాంగ్ పల్లవిని సినిమా టైటిల్ గా పెట్టుకోవడం ఓ అసెట్. నరేష్, శుభలేఖ సుధాకర్, మహర్షి రాఘవ, రాజీవి, తులసి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అత్తిలి లక్ష్మి, రావి కొండలరావు, రాధాకుమారి, చిట్టిబాబు, తదితరులు నటించిన ఈ మూవీకి విద్యాసాగర్ సంగీతం అదనపు ఆకర్షణ. ఈ మూవీ తమిళం, కన్నడంలో కూడా రీమేక్ అయి, విజయం అందుకుంది.

Admin

Recent Posts