Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరోగా, విలన్‌గా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడుకు చెందిన మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు.. భక్తవత్సలం నాయుడు అనే పేరుతో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవారు. సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై వెళ్లి స్టూడియోల చుట్టూ తిరిగారు. ఎలాగోలా సినిమాలో అవకాశం దక్కించుకొని మోహన్ బాబుగా తెలుగు సినీ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎన్టీఆర్-ఏఎన్నార్ తర్వాత డైలాగులు చెప్పటంలో మోహన్ బాబుకు ఆయనే సాటి అన్నంత పేరు ఉండేది.
ఇదిలా ఉంటే మోహన్ బాబు వ్యక్తిగత జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు కూడా ఉన్నాయి. మోహన్ బాబుకు ముందుగా విద్యా దేవితో వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే మంచు లక్ష్మి -మంచు విష్ణు. మోహన్ బాబు – విద్యాదేవి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉండేవాళ్లు. కెరీర్ ప్రారంభంలో మోహన్ బాబుకు సరిగా ఛాన్సులు లేనప్పుడు.. ఎన్ని కష్టాలు వచ్చినా విద్యాదేవి ఆయనకు ఎంతో ధైర్యం చెప్పే వారట. ఒకరోజు మోహన్ బాబు ఇంటి అద్దె కట్టటం ఆలస్యం కావడంతో ఆ ఇంటి యజమాని వారు వంట వండుకునే పాత్రల్లో మూత్ర విసర్జన చేయగా, ఆ సమయంలో మోహన్ బాబు విద్యాదేవి ఇంట్లోకి వెళ్లి ఏడ్చారట.
ఇక ఆ సమంలో మోహన్ బాబు చాలా హార్డ్ వర్క్ చేసే వారట. ఇంటిని పిల్లలని అంతగా పట్టించుకునే వారు కాదట. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో క్షణికావేశంలో విద్యాదేవి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ సమయంలో విష్ణు- లక్ష్మీ ఇద్దరూ కూడా చిన్న పిల్లలు. దాంతో పిల్లలకు తల్లి లేని లోటు తీర్చాలని దాసరి నారాయణ రావు లాంటి పెద్దలు జోక్యం చేసుకొని విద్యాదేవి చెల్లి నిర్మలాదేవితో మోహన్ బాబుకు రెండో వివాహం జరిపించారు. వీరి తనయుడు మంచు మనోజ్. మోహన్ బాబు తన విద్యాసంస్థలన్నిటికీ మొదటి భార్య విద్యాదేవి పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇక నిర్మలాదేవి కూడా విష్ణు- లక్ష్మీ తన అక్క కుమార్తెలు అయినా ఎక్కడ బేధం రాకుండా పెంచింది. నిర్మలా దేవితో పెళ్లి తర్వాతే మోహన్ బాబుకి కాస్త కోపం తగ్గిందని అంటారు.