Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Venkatesh Mother : వెంకటేష్ తల్లి రాజేశ్వరి గురించి ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలు..!

Admin by Admin
November 11, 2024
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Venkatesh Mother : భారత చలన చిత్ర చరిత్రలో నిర్మాత దగ్గుబాటి రామనాయుడిది ఓ అరుదైన అధ్యాయం అని చెప్పుకోవాలి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. మూవీ మొఘల్ అనే బిరుదును వంద శాతం ఆయన పరిపూర్ణం చేసుకున్నారు. రామానాయుడు చివరి శ్వాసవరకు సినిమాలే ఊపిరిగా బ్రతికారు. చరిత్రలో తన పేరు ఇప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని పేజీలు లిఖించుకున్నారు. తెలుగులోనే కాదు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ చిత్రాలు తీశారు. భారతీయ భాషలలో 150 కంటే అత్యధిక చిత్రాలను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు.

సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎందరో దర్శకులను, నటీ నటులను, సాంకేతిక నిపుణలను పరిచయం చేసిన ఘనత ఒక రామానాయుడుకే దక్కుతుంది. ముఖ్యంగా తెలుగు చిత్ర సీమ అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అద్వితీయం అని చెప్పవచ్చు. బ్రతుకు – బ్రతికించు అనే సిద్ధాంతాన్ని నమ్మడమే కాదు దాన్ని ఆచరించి చూపిన గొప్ప వ్యక్తి రామానాయుడు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందని అంటారు మన పెద్దలు. అలాగే రామానాయుడు విజయం వెనుక ఆయన సతీమణి రాజేశ్వరి పాత్ర ఎంతో ఉంది. వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కుమారులతో పాటు లక్ష్మి అనే కూతురు జన్మించారు. గ్రామంలో చేస్తున్న వ్యవసాయం వదిలేసి, సినీ రంగానికి వెళ్లాలని నిర్ణయించుకున్న రామానాయుడుని అందరూ నిరుత్సాహ పరిస్తే ఆయన రాజేశ్వరి మాత్రం వెన్నుదన్నుగా నిల్చి ప్రోత్సహించింది.

do you know these facts about rajeshwari

రామానాయుడు ఒంగోలులోని తన బంధువు బిబిఎల్ సూర్యనారాయణ ఇంట్లో వుంటూ ఎస్ ఎస్ ఎల్ సి చదివే సమయంలో అక్కడే ఉన్న తన మేనమామ ఇంటికి తరచూ వెళ్ళేవారట . ఆ సమయంలోనే రాజేశ్వరిని చూసి మనసు పారేసుకున్న రామానాయుడు రాజేశ్వరిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని ఆయన తండ్రికి చెప్పారట. కొడుకు మాట కాదనలేక ఆ అమ్మాయితోనే 1958లో పెళ్లి జరిపించారు. ఆరోజుల్లో వందల ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉండేది రామానాయుడు కుటుంబానికి. భర్తతో పాటు పొలానికి వెళ్లి, కూలిపనులు పర్యవేక్షించడమే కాకుండా రాజేశ్వరి కూడా కాయకష్టం చేసేవారట.

ఇక రూపాయి విలువ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో వచ్చిన ఆదాయంలో చాలా పొదుపు చేసేవారట రాజేశ్వరి. రామానాయుడు చిత్ర రంగానికి వెళ్ళడానికి వీలుగా ఒక్కసారిగా లక్షల్లో డబ్బు ఇచ్చేసరికి ఆయన షాక్ అయ్యారట. ఇది చిన్నప్పటి నుంచి దాచిన సొమ్మని ఆమె చెప్పడంతో ఆయన కళ్ళు చెమర్చాయట. రాజేశ్వరి హస్తవాసి ఎలాంటిదంటే, ఆమె చేతి డబ్బు తీసుకుని సినీ రంగానికి వెళ్లిన రామానాయుడికి పట్టిందల్లా బంగారం అయింది. ఆయన తీసిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి. ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందారు రామానాయుడు.

Tags: Venkatesh Mother
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నారో తెలుసా.. అందరికంటే హైయెస్ట్ ఆ హీరోనే..!?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.