Allu Sneha Reddy : అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు బన్నీ. అల్లుఅర్జున్ లవ్‌లో పడి ఆ లవ్‌ను కాస్త పెళ్లి పీటల వరకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఓవైపు సినిమాలో ఎంత బిజీగా ఉన్న తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాడు అల్లుఅర్జున్. ఈ అందమైన జంటకు అల్లుఅయాన్ అల్లు అర్హ అనే ఇద్దరు పిల్లలు.
అయితే ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకునే బన్నీ గతంలో సౌత్ ఆఫ్రికాలో జరిగిన పెళ్లిలో ఆయన భార్యతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే బన్నీ భార్య స్నేహారెడ్డి స్టైలిష్ డ్రెస్ వైరల్ గా మారింది. స్లీవ్ లెస్ రెడ్ టాప్ తో గ్రీన్ కలర్ లెహంగాతో బన్నీ భార్య స్పెషల్ గా నిలిచింది. అంతేకాదు స్నేహను చూసిన ఎవరైనా హీరోయిన్ అనాల్సిందే. అంత అందంతో మంత్రముగ్ధులను చేసింది.
ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో కానీ అల్లు ఫ్యామిలీలో కానీ ఇలాంటి డ్రెస్ వేసి హీట్ పుట్టించిన లేడీస్ తక్కువ. ఈ క్రమంలోనే బన్నీ భార్య ఫ్యామిలీలో హాట్ టాపిక్ గా నిలిచింది. మొదటి నుంచి స్నేహ ఫ్యాషన్ ను బాగా ఫాలో అయ్యేదట. అయితే పెద్దింటి కోడలు ఇలాంటి బట్టలు వేస్తే కచ్చితంగా ట్రోలింగ్ కి గురవుతుంది. అయితే అల్లు స్నేహారెడ్డి మాత్రం అలాంటి మాటలు ఎప్పుడు పట్టించుకోదట. అంతేకాదు నా పేరు సూర్య సినిమా రిలీజ్ అయిన తర్వాత బన్నీ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఆ టైంలో స్నేహ రెడ్డినే బన్నీకి సపోర్టుగా నిలిచింది. ఏది ఏమైనా.. అటు ట్రెడిషనల్ గా ఇటు మోడ్రన్ గా బన్నీ భార్య కేక అంటున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.