వినోదం

గాడ్ ఫాద‌ర్ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ప‌క్క‌న పెట్ట‌డం వెన‌క ఇంత క‌హానీ ఉందా?

మెగాస్టార్ చిరంజీవి చిత్రం గాడ్ ఫాద‌ర్ సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్క‌గా, ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు. అలాగే సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, అనసూయ, సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరు సల్మాన్ ఖాన్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకుని ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది అని చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

అయితే ప‌వ‌న్ బదులు స‌ల్మాన్‌ని ఆ సినిమాలో తీసుకోవ‌డం వెన‌క అస‌లు కార‌ణం హిందీ లో రిలీజ్ చేసుకోవడానికి మాత్రమే అని తెలుస్తుంది. అయితే స‌ల్మాన్ క్రేజ్ మిగతా భాషల్లో ఏ మాత్రం ప్రభావం చూపించ‌లేక‌పోయింది. అస‌లు సల్మాన్ స్థానంలో ప‌వ‌న్ న‌టించి ఉంటే మెగా అన్నదమ్ముల ఇద్దరినీ ఒకే టైం లో తెరపై చూస్తే ఆ “కిక్కే వేరబ్బా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే విషయంపై దర్శకుడు మోహన్ రాజా ఇటీవ‌ల మాట్లాడుతూ.. ”నేను దీనిని సినిమాగా చూసా అని పర్సనల్ కనెక్షన్ గురించి ఏమాత్రం ఆలోచనలేదు.

do you know why pawan kalyan not picked up for god father movie

ఫ్యామిలీలో హీరో చెప్పడం కంటే, బయట నుండి స్టార్ గురించి చెప్పడం బాగుంటుంది అని నేను అనుకున్నా.అలా అయితే ఫ్రెష్ గా ఉంటుందని భావించాను అని ఆయ‌న అన్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. అప్ప‌ట్లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

Admin

Recent Posts