సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్నప్పటి పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. తాజాగా ఓ బొద్దుగుమ్మ క్యూట్ పిక్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. మరి ఆ భామకి అభిమానులు గుడి కూడా కట్టారు. ఇప్పుడు గుర్తొచ్చిందా ఆమె ఎవరు అనేది.. అందాల భామ నమిత. ‘సొంతం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నమిత అనతి కాలంలోనే అగ్ర కథానాయకులతో జోడీ కట్టి ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నమిత.. ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చింది.
నమిత తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో అలరించి.. తన అందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సినిమా అవకాశాలు తగ్గడంతో నమిత వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. మరోవైపు రాజకీయాల్లో కూడా సత్తా చూపెడుతోంది. చిన్ననాటి నుంచి సినిమాలపై ఆసక్తితోనే మోడలింగ్ నుంచి ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది. రవితేజతో ఒకరాజు ఒకరాణి, ప్రభాస్ బిల్లా, బాలయ్య సింహా లాంటి సినిమాలు చేసినా కూడా తెలుగులో ఈ భామకు కోరుకున్న క్రేజ్ మాత్రం రాలేదు. సింహాలో సింహ మంటి చిన్నోడు పాటతో క్రేజ్ వచ్చినా.. అందులో ఈమెది కూరలో కరివేపాకు టైపు క్యారెక్టర్ కావడంతో పెద్దగా కెరీర్‌కు ఉపయోగపడలేదు.
తాజాగా నమిత చిన్నప్పటి పిక్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ పిక్ చూసి చిన్నప్పుడు కూడా నమిత బొద్దుగా క్యూట్ గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత కూడా హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది నమిత. అంతేకాదు తమిళనాడు బీజేపీ ఎక్స్‌క్యూటివ్ మెంబర్‌గా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టింది. ఇక తమిళనాడులో అప్పట్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధుల తరుపున కొన్ని చోట్ల ప్రచారం చేసింది. టీవీ రియాలిటీ షోల్లో జడ్జ్‌గా పలు షోలకు నాయకత్వం వహించారు.