Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్లు సంపాదించారు. అయితే ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఇంటిని, ఇంట్లో చేసే సందడికి సంబంధించిన వీడియోలని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నారు. చిరంజీవి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో కొత్త ఇంటిని నిర్మించుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి ఎంతో ఇష్టపడి ఈ ఇంటిని నిర్మించుకున్నారు.
కొత్త ఇంటిని మరిన్ని హంగులతో తీర్చిదిద్దారు . కొత్త ఇంటిని దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించి.. సకల సదుపాయాలతో పాటు, అనేక ఖరీదైన వస్తువులను ఇంట్లో సమకూర్చారు. ముఖ్యంగా బెడ్ రూమ్‌ను నగలు, ఆభరణాల తయారీలో వాడే పచ్చరాళ్లను ఉపయోగించి పెద్దగా రూపొందించారు. దీనికి తోడు ఇంట్లో ప్రత్యేకంగా ఓ పెద్ద పూజగదిని కూడా నిర్మించారు.. హైదరాబాద్ సంస్కృతి అద్దం పట్టేలా ఈ కొత్త ఇల్లు ఉందని పలువురు చెప్పుకొస్తున్నారు. ఇంటి ముందు అయితే పెద్ద గార్డెన్‌లా రూపొందించుకున్నారు. కరోనా సమయంలో చిరు ఓ వీడియో షేర్ చేయగా, ఇది స్పష్టంగా కనిపించింది.
ఇక చిరంజీవి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ నలుగురికి అండగా ఉంటున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పటల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది. సినీ కార్మికులు, మెగా ఫ్యాన్స్, సినీ పాత్రికేయులు దాదాపు 2 వేల మంది వరకు ఈ క్యాంపులో ఉచితంగా పరీక్షలు చేయించుకునేందుకు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ మన్నం పర్యవేక్షణలో నిపుణులైన వైద్య బృందం ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు హాజరయ్యారు.